గతంలో ప్రభుత్వానికి సంబంధించిన ఇంటింటికి కరపత్రాల పంపిణీ, స్టిక్కర్లు అంటించడం వంటి పనులు వాలంటీర్లు చేసేవారు. సచివాలయ ఉద్యోగులకు అలాంటి పనులు అప్పగించేవారు కాదు. డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ చేసి ఏపీపీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్ రాసి, నియామకం అయిన సచివాలయ ఉద్యోగులను హుందాగా చూసేవారు. రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,30,694 మంది ఉద్యోగులు ఉన్నారు.