ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ
ఏపీలో ప్రతి నెలా ఒకటే తేదీనే ఇంటి వద్దే 95 శాతం పింఛన్లు పంపిణీ చేస్తున్నామని కూటమి ప్రభుత్వం తెలుపుతుంది. సాంకేతిక సమస్యలతో కొందరికి ఒకటో తేదీన పింఛన్ అందడంలేదని, అలాంటి వారికి రెండో తేదీన కచ్చితంగా పింఛన్ అందుతుందని స్పష్టం చేస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు జీతాలు, పింఛన్ దారులకు నగదు ప్రతి నెల ఒకటో తేదీనే అందుతున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఇతర సంక్షేమ పథకాలు సైతం అమల్లో చేస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.