అనుచిత పోస్టులు పెడితే కేసులు
ఇటీవల జడ్జిలను దూషిస్తూ కొందరు పోస్టులు పెట్టారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు. వైసీపీతో పాటు ప్రతిపక్ష నేతలపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చర్యలు తప్పవన్నారు. అవసరమైతే ఆస్తులు జప్తు చేయడానికి సైతం వెనకాడమన్నారు. సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంకర పోస్టులను తొలగిస్తున్నామన్నారు. ఇతర దేశాల నుంచి పెడుతున్న అసభ్యకర పోస్టులను గుర్తించి, బాధ్యులపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. హైకోర్టు జడ్జిపై అనుచిత పోస్టులు పెట్టిన 19 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. ఇందులో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, గోరంట్ల రామ్ ఉన్నారని, వీరికి నోటీసులు ఇచ్చామన్నారు. సోషల్ మీడియాలో అనుచిత మెసేజ్‌లు పెట్టిన 2972 మందిపై సైబర్ బుల్లియింగ్ షీట్స్ ఓపెన్ చేశామన్నారు. యువత అవసరంగా భవిష్యత్ పాడుచేసుకోవద్దని సూచించారు.