Homeతెలుగు రాష్ట్రాలుAP Cabinet Decisions : ఫీజు రీయంబర్స్మెంట్ పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, నేరుగా...

AP Cabinet Decisions : ఫీజు రీయంబర్స్మెంట్ పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, నేరుగా కాలేజీల ఖాతాల్లోనే- కేబినెట్ నిర్ణయాలివే


సెమీ కండక్టర్ పరిశ్రమలకు 50 శాతం సబ్సిడీ

ఏపీ డేటా సెంటర్ పాలసీ 4.O కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఈ పాలసీ ద్వారా డేటా సెంటర్ల ఏర్పాట్లను ప్రోత్సహిస్తామన్నారు. దీంతో పాటు సెమీ కండక్టర్ పాలసీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. సెమీ కండక్టర్ పరిశ్రమలు ప్రారంభించే వారికి 50 శాతం సబ్సిడీ లేదా ఇన్సెంటివ్ అందిస్తామన్నారు. చిప్, సెమీ కండక్టర్ పరిశ్రమలకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రోత్సహిస్తామన్నారు. కుప్పం, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అలాగే సీఆర్డీఏ పరిధిని 8352 చ.కి.మీ.కు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. సీఆర్డీఏలోకి పల్నాడు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి 154 గ్రామాలను చేర్చనున్నట్లు తెలిపారు.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments