Ap Assembly Live Updates: ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు కూడా గందరగోళం కొనసాగింది. సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను ముట్టడించారు. సిఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Fri, 22 Sep 202304:11 AM IST
టీడీపీ సభ్యులు తీరు మార్చుకోవాలన్న బుగ్గన
టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోవాలని సూచించారు. కావాలనే సభకు అంతరాయం కలిగిస్తున్నారని మంత్రి బుగ్గన అన్నారు.
Fri, 22 Sep 202304:03 AM IST
ఏపీ అసెంబ్లీకి చేరుకున్న సిఎం జగన్
ఏపీ అసెంబ్లీ ప్రాంగణానికి సిఎం జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. శాసన సభా సమావేశాలు రెండో రోజు కొద్ది సేపటి క్రితం ప్రారంభం అయ్యాయి.
Fri, 22 Sep 202303:59 AM IST
టీడీపీ సభ్యులపై బుగ్గన ఆగ్రహం
స్పీకర్ పోడియం చుట్టుముట్టిన టీడీపీ సభ్యులపై మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు సిద్ధమని తాము చెబుతున్నా సభా కార్యక్రమాలకు అడ్డు తగలడాన్ని తప్పు పట్టారు.
Fri, 22 Sep 202303:58 AM IST
చర్చకు సిద్ధమన్న అంబటి…
బాలకృష్ణ రీల్ హీర్.. సీఎం జగన్ రియల్ హీరో అని సభలో తొడలు కొడితే రియల్ హీరోలు అయిపోరని, మీరు నీతిమంతులైతే దమ్ముంటే చర్చకు రావాలన్నారు. చంద్రబాబు అవినీతిపై వివరంగా చర్చిద్దామని, మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
Fri, 22 Sep 202303:56 AM IST
కేసులు ఎత్తివేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలు
చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయడం, సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీడీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.
Fri, 22 Sep 202303:55 AM IST
ప్లకార్డులు ప్రదర్శిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు
చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనకు దిగారు. అసెంబ్లీకి పాదయాత్రగా వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులతో నిరసనకు దిగారు. అసెంబ్లీ లోపలికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలకు దిగారు. స్కిల్ డెవలప్ మెంట్ అంశంపై ప్రభుత్వం సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మాకు అవకాశం ఇవ్వాల్సిందేని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పట్టుబడుతున్నారు.
Fri, 22 Sep 202303:50 AM IST
టీడీపీ సభ్యుల ఆందోళన
శాసనసభలో రెండోరోజూ చంద్రబాబు అరెస్టు అంశంపై టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. సమావేశాలు ప్రారంభమైన వెంటనే నినాదాలతో హోరెత్తించారు. టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులు బుగ్గన, అంబటి, జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.