ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ సమీక్ష
ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ జవహర్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు. జనవరి 31వ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై సీఎస్ సమీక్ష చేశారు. అధికారుల బదిలీలపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇప్పటి వరకు వివిధ శాఖలకు చెందిన దాదాపు 2 వేల మందిని బదిలీ చేసినట్టు ప్రభుత్వం ఈసీకి తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, సిబ్బంది ఖాళీలు ఇతర అంశాలపై సీఎస్ జవహర్ రెడ్డి ఈ సమీక్ష చర్చించారు. సీఎస్‌తో సమీక్షలో ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు సీఈఓలు పాల్గొన్నారు.ఈ సమావేశంలో సీఈవో ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ…ఎన్నికల విధులతో సంబంధం ఉండి ఒకే ప్రాంతంలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులు, సిబ్బందిని బదిలీ చేయాలన్నారు. ఇప్పటికే కొన్ని శాఖల్లో బదిలీలు జరిగాయని తెలిపారు. రెవెన్యూ, మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఎక్సైజ్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, పోలీస్ శాఖల్లో బదిలీ చేయాల్సిన వారిని గుర్తించారన్నారు. మరో మూడు రోజుల్లో వారిని బదిలీ చేయాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు సీఈఓ మీనా ఆదేశిచారు.