Akkineni Naga Chaitanya: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమయ్యారడు. దూత నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. సూపర్ నాచురుల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ కి క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ లో ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మాత శరత్ మరార్ ఈ వెబ్ సిరీస్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన దూత ప్రమోషనల్ కంటెంట్ చాలా క్యూరియాసిటీని పెంచింది. డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన చై.. వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఇస్తూ.. సిరీస్ పై ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు.
Amardeep: అడుక్కోవడం.. అలగడం తప్ప.. ఏమైనా చేస్తున్నావా బ్రో.. ?
ఇక ఒక ఇంటర్వ్యూలో చై.. సామ్ నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ గురించి చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి కూడా సామ్- చై విడిపోవడానికి ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కారణమని ఎన్నో పుకార్లు వచ్చాయి. పెళ్లి తరువాత అంత బోల్డ్ క్యారెక్టర్ ను సామ్ చేయడం వలనే ఇంట్లో కొన్ని విబేధాలు తలెత్తాయని, ఆ విబేధాలు పెరిగి.. చివరికి వారు విడాకులు తీసుకున్నారని కూడా చెప్పుకొచ్చారు. ఇక విడాకుల తరువాత సామ్, చై గురించి మాట్లాడడానికి ఎప్పుడు ఇష్టపడలేదు కానీ, చై మాత్రం.. సామ్ గురించి ఎన్నో ఇంటర్వ్యూలలో పాజిటివ్ గానే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక తాజాగా ” ఇప్పటివరకు మీ మనసును కదిలించిన ఇండియన్ వెబ్ సిరీస్ ఏది.. ? అన్న ప్రశ్నకు చై తడుముకోకుండా ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అని చెప్పుకొచ్చాడు. అయితే పర్టిక్యులర్ గా ఫ్యామిలీ మ్యాన్ మొదటి భాగమా.. ? సామ్ నటించిన రెండో భాగమా.. ? అనేది చెప్పలేదు కానీ, అమెజాన్ ప్రైమ్ రిలీజ్ చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సిరీస్ తో చై ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.