- క్షిపణులు..ఆయుధాల తయారీలో కీలకం
- ప్రపంచంలోని టాప్ 3 ఆయుధ తయారీదారులలో ఒకటిగా ఎడ్జ్
- గ్లోబల్ డిఫెన్స్‌లో భారీ బెంచ్‌మార్క్ క్రియేట్ చేస్తాం: సీఈవో ఆశిష్ రాజ్‌వంశీ
అదానీ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి చెందిన ఎడ్జ్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక నుంచి రెండు గ్రూపులు సంయుక్తంగా క్షిపణులు, ఆయుధాలను అభివృద్ధి చేస్తాయనున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఆధారిత ఎడ్జ్(EDGE) గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద అధునాతన సాంకేతికత, రక్షణ సంస్థగా పేరుగాంచింది. EDGE గ్రూప్ లో 25 కంపెనీలు ఉన్నాయి. సైనిక, పౌర రంగాలకు సంబంధించిన సాంకేతికతలను ఉత్పత్తులు చేస్తుంది. EDGE గ్రూప్ ప్రపంచంలోని టాప్ 3 ఆయుధ తయారీదారులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఒప్పందం లక్ష్యం.. రెండు కంపెనీల రక్షణ, ఏరోస్పేస్ సామర్థ్యాలను ప్రభావితం చేసే గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించడం. వాటి సంబంధిత ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలను ఒకచోట చేర్చడం. ప్రపంచ, స్థానిక వినియోగదారుల అవసరాలను తీర్చడం.
READ MORE: Viral Video: రీల్స్కు అడ్డాగా మారిన ఢిల్లీ మెట్రో.. ఇద్దరు యువతుల డ్యాన్స్ వైరల్
ఒప్పందం ప్రకారం.. ఇరు సంస్థలు క్షిపణులు, ఆయుధాలు, ప్లాట్‌ఫారమ్‌లు, మానవరహిత, వాయు రక్షణ ఉత్పత్తులను తయారు చేస్తాయి. ఈ ఒప్పందం ద్వారా.. భారతదేశం-UAE లలో R&D సౌకర్యాలను సృష్టించేందుకు పని చేయబడుతుంది. దీని ద్వారా దక్షిణాసియా దేశాలలో.. పెరుగుతున్న ప్రపంచ మార్కెట్‌లో ఉనికిని నెలకొల్పవచ్చు. ఇందులో డిఫెన్స్, ఏరోస్పేస్ సొల్యూషన్స్‌కు సంబంధించిన ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ, నిర్వహణ చేపడతారు.
ఈ ఒప్పందం గురించి అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్ సీఈవో (CEO) ఆశిష్ రాజ్‌వంశీ మాట్లాడుతూ.. “రక్షణ సామర్థ్యాలకు సంబంధించిన కొత్త దిశలను అభివృద్ధి చేయడానికి ఈ ఒప్పందం నాందిని సూచిస్తుంది. ఇది భారతదేశం మరియు UAE మధ్య అధునాతన సాంకేతిక పురోగతి, ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని అందిస్తుంది. రక్షణ, ఏరోస్పేస్ రంగంలో అత్యాధునిక పరిష్కారాలను అందించడమే కాకుండా, గ్లోబల్ డిఫెన్స్‌లో భారీ బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తుంది.” అని పేర్కొన్నారు.