ప్రధాని మోడీ (PM Modi) రెండ్రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి వెళ్లారు. ప్రస్తుతం ఆయన అబుదాబిలో (Abu Dhabi) పర్యటిస్తున్నారు. కానీ అక్కడ పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో పాటు వడగండ్లు కూడా పడడంతో రోడ్లన్నీ మంచుగడ్డలతో నిండిపోయాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉద్యోగులు తమ ఆరోగ్యం మరియు భద్రతను చూసుకోవాలని కోరింది.
భారీ వర్షాల కారణంగా కారు నీళ్లలో కొట్టుకుపోయాయి. ఇక పలు దుకాణాలు నీటిలో మునిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉంటే బుధవారం అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అనంతరం జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో జరిగే ‘అహ్లాన్ మోడీ’ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు.
మరోవైపు అబుదాబిలో ప్రతికూల వాతావరణం నెలకొంది. దీంతో అహ్లాన్ మోడీ ఈవెంట్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులులు భావిస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి జనాలు హాజరయ్యే విషయంలో సందిగ్ధం నెలకొంది. భారీగా జనాలు తగ్గవచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఇక పర్యటనలో భాగంగా మోడీ.. అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరియు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌లతో ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నాయి.