Homeతెలుగు రాష్ట్రాలుAa Okkati Adakku OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆ ఒక్కటి అడక్కు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Aa Okkati Adakku OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆ ఒక్కటి అడక్కు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?


Aa Okkati Adakku OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘ఆ ఒక్కటి అడక్కు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Aa Okkati Adakku OTT Release Date: మల్లి అంకం దర్శకత్వంలో అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’. రాజీవ్‌ చిలక నిర్మించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా కథానాయిక. ఇందులో వెన్నెల కిశోర్‌, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. గత కొన్నేళ్ల నుంచి యాక్షన్ సినిమాలు, స్టార్ హీరోల మూవీస్‌లో కీలక పాత్రలు పోషిస్తూ వచ్చిన అల్లరి నరేశ్‌.. చాన్నాళ్ల తర్వాత తన మార్క్ కామెడీ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మే 3న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా.. భారీ వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది.


నెల తిరక్కుండానే ఎలాండి హడావుడి లేకుండా ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాగూ వీకెండ్ కాబట్టి థియేటర్లలో చూడని వారు ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఆ ఒక్కటి అడక్కు చిత్రానికి ఓటీటీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Also Read: Gangs of Godavari Twitter Review: ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ట్విట్టర్ రివ్యూ.. ప్రేక్షకులు ఏమంటున్నారంటే?

అల్లరి నరేశ్ గత కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ ఒక్కటి అడక్కుపై భారీ ఆశలు పెట్టుకున్నా.. అడియాశలయ్యాయి. ఇటీవలే ‘బచ్చల మల్లి’ సినిమా అప్‌డేట్ అల్లరి నరేశ్‌ అందించిన విషయం తెలిసిందే. 1990 కాలం నాటి భావోద్వేగ ప్రయాణం నేపథ్యంలో సినిమా వస్తోంది. హాస్య మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకుడు.

 

 





Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments