Homeతెలుగు రాష్ట్రాలుమొరాకోలో భారీ భూకంపం... 2వేలకు చేరిన మృతుల సంఖ్య - Mana Telangana

మొరాకోలో భారీ భూకంపం… 2వేలకు చేరిన మృతుల సంఖ్య – Mana Telangana


– Advertisement –

మర్రాకేశ్(మొరాకో): మొరాకోలో భూకంప మృతుల సంఖ్య 2వేలకు చేరింది. ఆఫ్రికా దేశమైన మొరాకోలో శుక్రవారం రాత్రి ఘోర భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి మర్రాకేశ్ నగరం బారీగా ధ్వంసమైంది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. అకస్మాత్తుగా భవనాలు ధ్వంసం కావడంతో ప్రజలు కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో రెండు వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారీగా, ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.

అల్ హౌజ్, మర్రాకేశ్, క్వార్జాజేట్, అజిలాల్ సహా పలు ప్రాంతాలు ఈ భూకంపం ధాటికి వణికిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మర్రాకేశ్‌లో 12వ శతాబ్దంలో నిర్మించిన ప్రఖ్యాత కౌటోబియా మసీదు బాగా దెబ్బతింది. 226 అడుగుల ఎత్తున ఉన్న బురుజు వంటి నిర్మాణం దెబ్బతింది. పాత నగరం చుట్టూ ఉన్న ప్రాచీన గోడలు దెబ్బతినడంతో వాటి దృశ్యాలు మొరాకో ప్రజలు పోస్ట్ చేశారు. మొరాకో భూకంప విధ్యంసంపై ప్రపంచ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మొరాకోను ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.

కాగా, పర్యాటక ప్రాంతమైన మర్రాకేశ్‌కు నైరుతి దిశగా 71 కిలో మీటర్ల దూరంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత 6.8 గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అల్‌హౌజ్ ప్రావిన్స్ లోని ఎల్‌ఘిల్ నగరంలో భూకంప కేంద్రంగా ప్రకంపనలు వ్యాపించినట్టు అధికారులు చెప్పారు. 18 కిమీ లోతున భూకంపం కేంద్రీకృతమైంది.

 

– Advertisement –



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments