భర్త, పిల్లలకు..
‘‘నా తల్లికి, భర్త రాబర్ట్ కు, వజ్రాల్లాంటి నా ఇద్దరు పిల్లలు రైహాన్, మిరాయా లకు.. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు, ధైర్యానికి ఏ కృతజ్ఞత సరిపోదు. నా అన్న రాహుల్ కి నువ్వు అందరికంటే ధైర్యవంతుడివి… నాకు దారి చూపినందుకు, నా వెన్నుదన్నుగా నిలిచినందుకు ధన్యవాదాలు’’ అని 52 ఏళ్ల కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఓటర్లు రాహుల్ గాంధీకి వారసుడిగా, అతడి చెల్లి ప్రియాంక గాంధీ వాద్రాను ఎన్నుకున్నారు. అధికార వామపక్షాలు, బీజేపీ పోటీలో నిలిపిన అభ్యర్థులను ఆమె ఓడించారు.