One Nation, One Election: ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ బిల్లుకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక బిల్లు ఇది. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొంది చట్ట రూపం దాలిస్తే, దేశవ్యాప్తంగా, ఒకేసారి లోక్ సభ ఎన్నికలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ బిల్లును ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.