అక్టోబర్ 7, 2023 – మంటలకు ఆజ్యం
సిరియా యుద్ధం, సిరియాలోని గోలన్ హైట్స్ పై ఇజ్రాయెల్ ఆక్రమణ సమయం నుంచి ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు రగులుతూనే ఉన్నాయి. అయితే, 2023 అక్టోబర్ 7న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ సభ్యులు దక్షిణ ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించి పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ పౌరులను హతమార్చింది. చాలామందిని బందీలుగా తీసుకువెళ్లింది. ఈ మెరుపు దాడితో ఇజ్రాయెల్ నివ్వెరపోయింది. వెంటనే, హమాస్ పై యుద్ధం ప్రకటించి, హమాస్ ప్రబలంగా ఉన్న పాలస్తీనాలోని గాజా తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేయడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా 41,600 మంది మరణించారని పాలస్తీనా ప్రకటించింది. అక్టోబర్ 7న జరిగిన సంఘటనల గురించి తమకు తెలియదని ఇరాన్ ఖండించినప్పటికీ, హమాస్ తో ఇరాన్ కు ఉన్న సంబంధాల కారణంగా ఇరాన్ ను కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం నిందించింది. అదే సమయంలో, లెబనాన్ సరిహద్దులో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ దళాల మధ్య పలుమార్లు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి.