Crime news: మోకాలి శస్త్రచికిత్స అనంతరం చికిత్స పొందుతున్న కజకిస్థాన్ కు చెందిన 50 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడిన గురుగ్రామ్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఉద్యోగిని గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం ఆర్టెమిస్ ఆసుపత్రిలో ఈ అత్యాచారం ఘటన జరిగిందని, అదే రోజు నిందితుడు ఠాకూర్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుడు ఠాకూర్ రాజస్థాన్ లోని తిజారా జిల్లా ఖైర్తాల్ కు చెందిన వాడని వెల్లడించారు.