Homeజాతీయంసౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,425 అప్రెంటిస్ ఖాళీలు - ఈ అర్హతలుండాలి

సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,425 అప్రెంటిస్ ఖాళీలు – ఈ అర్హతలుండాలి


South Eastern Coalfields Limited Recruitment: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లోని సౌత్-ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(ఎస్‌ఈసీఎల్‌) గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్‌ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మైనింగ్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ విభాగాల్లో 1425 అప్రెంటిస్ పోస్టులను భర్తీచేయనున్నారు. సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 27లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఉత్తీర్ణత సంవత్సరం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా. దరఖాస్తుల నుంచి ఎంపికచేసిన అభ్యర్థులకు మార్చి 15న ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు.

వివరాలు..

* గ్రాడ్యుయేట్/టెక్నీషియన్‌ అప్రెంటిస్ పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1,425.

🔰 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 350 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు..

➥ మైనింగ్ ఇంజినీరింగ్‌: 200 

పోస్టుల కేటాయింపు: జనరల్-100, ఓబీసీ-26, ఎస్సీ-28, ఎస్టీ-46.

➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌: 50

పోస్టుల కేటాయింపు: జనరల్-25, ఓబీసీ-06, ఎస్సీ-07, ఎస్టీ-12.

➥ మెకానికల్ ఇంజినీరింగ్‌: 50 

పోస్టుల కేటాయింపు: జనరల్-25 , ఓబీసీ-06, ఎస్సీ-07, ఎస్టీ-12.

➥ సివిల్ ఇంజినీరింగ్‌: 30

పోస్టుల కేటాయింపు: జనరల్-15 , ఓబీసీ-04, ఎస్సీ-04, ఎస్టీ-07.

➥ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌: 20

పోస్టుల కేటాయింపు: జనరల్-10 , ఓబీసీ-02, ఎస్సీ-03, ఎస్టీ-05.

అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

స్టైపెండ్: రూ.9000.

🔰 టెక్నీషియన్‌ అప్రెంటిస్: 1075 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు..

➥ మైనింగ్ ఇంజినీరింగ్/ మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్: 900

పోస్టుల కేటాయింపు: జనరల్-450, ఓబీసీ-117, ఎస్సీ-126, ఎస్టీ-207.

➥ మెకానికల్ ఇంజినీరింగ్‌: 50

పోస్టుల కేటాయింపు: జనరల్-25, ఓబీసీ-06, ఎస్సీ-07, ఎస్టీ-12.

➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌: 75

పోస్టుల కేటాయింపు: జనరల్-38, ఓబీసీ-10, ఎస్సీ-10, ఎస్టీ-17.

➥ సివిల్ ఇంజినీరింగ్‌: 50

పోస్టుల కేటాయింపు: జనరల్-25, ఓబీసీ-06, ఎస్సీ-07, ఎస్టీ-12.

అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 13.022024 నాటికి 18 సంవత్సరాలలోపు ఉండాలి.

స్టైపెండ్: రూ.8000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఉత్తీర్ణత సంవత్సరం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.02.2024.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.02.2024.

Notification

Website

ALSO READ:

ఏఐఈఎస్‌ఎల్‌లో 100 టెక్నీషియన్‌ పోస్టులు, వివరాలు ఇలా
న్యూఢిల్లీలోని ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్‌ సర్టిఫికెట్‌, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, టెక్నికల్ అసెస్‌మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా  రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments