Homeజాతీయంసెబీలో 97 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, ఎంపికైతే రూ.89 వేల వరకు జీతం

సెబీలో 97 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, ఎంపికైతే రూ.89 వేల వరకు జీతం


SEBI – Recruitment of Officer Grade A (Assistant Manager) 2024: ముంబయిలోని ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్‌ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)’ వివిధ విభాగాల్లో ఆఫీసర్ గ్రేడ్-ఎ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 97 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎల్‌ఎల్‌బీ, పీజీ, సీఏ, సీఎఫ్‌ఏ, సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

వివరాలు..

* ఆఫీసర్ గ్రేడ్-ఎ (అసిస్టెంట్ మేనేజర్)

ఖాళీల సంఖ్య: 97 పోస్టులు

విభాగాలవారీగా ఖాళీలు..

➥ జనరల్: 62 పోస్టులు 
అర్హత: మాస్టర్స్ డిగ్రీ/ పీజీ డిప్లొమా (లేదా) బ్యాచిలర్స్ డిగ్రీ లా/ఇంజినీరింగ్.

➥ లీగల్: 05 పోస్టులు 
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ లా. అడ్వొకేట్‌గా రెండేళ్ల ప్రాక్టీస్ ఉండాలి.

➥ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ: 24 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్)/ ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్ సైన్స్‌లో పీజీ డిగ్రీ ఉండాలి. 

➥ రిసెర్చ్: 02 
అర్హతలు..
➜ మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా (ఎకనామిక్స్, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామెట్రిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్, బిజినెస్ అనలిటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా) 

➜ మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా (ఫైనాన్స్, క్వాంటిటేటివ్ ఫైనాన్స్, మ్యాథమెటికల్ ఫైనాన్స్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్, బిజినెస్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ అండ్ ట్రేడ్ ఫైనాన్స్, ప్రాజెక్ట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, అగ్రికల్చరల్ బిజినెస్ ఫైనాన్స్) ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)

➜ మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా (స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఇన్‌ఫర్మాటిక్స్, అప్లయిడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్‌ఫర్మాటిక్స్, డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
* మాస్టర్స్ డిగ్రీ (మ్యాథమెటిక్స్)తోపాటు ఏడాది పీజీ డిప్లొమా (స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

➥ అఫీషియల్‌ లాంగ్వేజ్‌: 02
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (హిందీ) హిందీ ట్రాన్స్‌లేషన్ తెలిసి ఉండాలి. డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. (లేదా) మాస్టర్స్ డిగ్రీ (సంస్కృతం/ఇంగ్లిష్/ఎకనామిక్స్/కామర్స్). డిగ్రీలో హిందీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. 

➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 02 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్). సీసీటీవీ సర్వేయలెన్స్, యూపీఎసీఎస్ తదితర విభాగాల్లో పనిఅనుభవం ఉండాలి.

ALSO READ: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 214 ఉద్యోగాలు – దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

వయోపరిమితి: 31.03.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. 

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఫేజ్-1 (ఆన్‌లైన్ పరీక్ష), ఫేజ్-2 (ఆన్‌లైన్ పరీక్ష), ఫేజ్-3 (ఇంటర్వ్యూ), డాక్యుమెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. 

పే స్కేల్: నెలకు రూ.44,500 నుంచి రూ.89,150.

ముఖ్యమైన తేదీలు..

⫸ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 30.06.2024.

⫸ ఫేజ్-I ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 27.07.2024.

⫸ ఫేజ్-II ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 31.08.2024.

⫸  ఫేజ్-II పేపర్-2 (ఐటీ) పరీక్ష తేదీ: 14.09.2024.

Notification

Online Application

Website



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments