Homeజాతీయంవిక్రమ్‌ను ఫొటో తీసిన చంద్రయాన్‌ 2 ఆర్బిటర్‌

విక్రమ్‌ను ఫొటో తీసిన చంద్రయాన్‌ 2 ఆర్బిటర్‌



<p>చంద్రుడి దక్షిణ ధృవంపైకి చంద్రయాన్&zwnj; ౩ ప్రయోగం ద్వారా పంపించిన విక్రమ్&zwnj; ల్యాండర్&zwnj;ను చంద్రయాన్&zwnj; 2 ఆర్బిటర్&zwnj; ఫొటో తీసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ఫొటోలను ట్విట్టర్&zwnj; ద్వారా పంచుకుంది. నాలుగేళ్ల క్రితం ఇస్రో చంద్రయాన్&zwnj; 2 ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు పంపిన ల్యాండర్&zwnj; జాబిల్లిపై దిగలేకపోయింది. కానీ ఆర్బిటర్&zwnj; మాత్రం చంద్రుడి కక్ష్యలో తిరుగుతూనే ఉంది. సెప్టెంబరు 6న చంద్రయాన్&zwnj; 2 ఆర్బిటర్&zwnj; డ్యూయల్&zwnj; ఫ్రీకెన్సీ సింథటిక్&zwnj; అపెర్చూర్&zwnj; రాడార్&zwnj; (డీఎఫ్&zwnj;ఎస్&zwnj;ఏఆర్&zwnj;) ద్వారా స్లీప్&zwnj; మోడ్&zwnj;లో ఉన్న విక్రమ్&zwnj; ల్యాండర్&zwnj; ఫొటోలు తీసిందని ఇస్రో తన ఖాతాలో షేర్&zwnj; చేసింది.&nbsp;</p>
<p>ఇస్రో 2019 సెప్టెంబరులో చంద్రయాన్&zwnj; 2 ను ప్రయోగించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్&zwnj;ను సాఫ్ట్&zwnj; ల్యాండ్&zwnj; చేసే లక్ష్యంతోనే పంపించింది. అయితే ల్యాండ్ అయ్యే సమయంలో ప్రయోగం విఫలమై ల్యాండర్&zwnj; క్రాష్&zwnj; ల్యాండయ్యింది. ఆర్బిటర్&zwnj; మాత్రం విజయవంతంగా చంద్రుడి చుట్టూ తిరుగుతుంది. ఆ ప్రయోగం విఫలం కావడంతో ఇస్రో మరింత జాగ్రత్తగా ఎంతో శ్రమ పడి చంద్రయాన్&zwnj; 3 ను ఇటీవల చంద్రుడిపైకి పంపిన సంగతి తెలిసిందే. ఆగస్టు 23న చంద్రయాన్&zwnj; 3 ద్వారా పంపిన ల్యాండర్&zwnj; విక్రమ్&zwnj; చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై సాఫ్ట్&zwnj; ల్యాండ్&zwnj; అయ్యి ప్రయోగం విజయవంతమైంది. ప్రపంచంలోనే జాబిల్లి దక్షిణ ధృవంపై ల్యాండర్&zwnj;ను దించిన తొలి దేశంగా భారత్&zwnj; చరిత్రకెక్కింది. అయితే గతంలో పంపించిన ఆర్బిటర్&zwnj;ను ఇస్రో ఈ ప్రయోగం కోసం కూడా ఉపయోగించుకుంది. విజయవంతంగా విక్రమ్&zwnj;ను ఆర్బిటర్&zwnj;తో అనుసంధానించింది.</p>
<p>చంద్రయాన్&zwnj; 2 ఆర్బిటర్&zwnj;లోని డీఎఫ్&zwnj;ఎస్&zwnj;ఏఆర్&zwnj; చాలా కీలకమైన పరికరమని ఇస్రో వెల్లడించింది. ఎల్&zwnj;, ఎస్&zwnj; బ్యాండ్&zwnj; మైక్రోవేవ్&zwnj;లతో ఉపయోగించే దీని ద్వారా చంద్రుడి ఉపరితలం ఫొటోలను పంపిస్తుందని తెలిపింది. ఇది అత్యుత్తమ రిజెల్యూషన్&zwnj;తో పోలారిమెట్రిక్&zwnj; ఫొటోలను అందిస్తుందని పేర్కొంది. ఇది గత నాలుగేళ్లుగా చంద్రుడి ఉపరితలాన్ని చిత్రీకరిస్తోందని, అత్యంత నాణ్యమైన డేటాను సేకరిస్తోందని ఇస్రో తెలిపింది. ఇది రాడార్&zwnj; అవ్వడం వల్ల సూర్యుడి వెలుతురు అవసరం లేకుండా ఫొటోలు తీయగలదని వెల్లడించింది.</p>
<p>చంద్రయాన్&zwnj; ౩ నుంచి పంపించిన విక్రమ్&zwnj; ల్యాండర్&zwnj;, ప్రజ్ఞాన్&zwnj; రోవర్&zwnj; &nbsp; ప్రస్తుతం స్లీప్&zwnj; మోడ్&zwnj;లో ఉన్నాయి. ప్రస్తుతం చంద్రుడిపై లూనార్&zwnj; నైట్&zwnj; కావడంతో అవి స్లీప్&zwnj; మోడ్&zwnj;లోకి వెళ్లాయి. పద్నాలుగు రోజుల పాటు రోవర్&zwnj;, ల్యాండర్&zwnj; చంద్రుడి దక్షిణ ధృవం నుంచి ఇస్రోకు కీలకమైన సమాచారం అందించాయి. ఈ నెల 22న చంద్రుడిపై తిరిగి ల్యూనార్&zwnj; డే ప్రారంభమవుతుంది. చంద్రుడిపై తిరిగి సూర్యకాంతి పడుతుంది. అయితే తిరిగి ల్యాండర్&zwnj;, రోవర్&zwnj; పనిచేస్తాయా లేదా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.&nbsp;</p>



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments