Homeజాతీయంరూ.25 వేల జీతం కోసం అప్లయ్ చేసుకుంటే రూ. 250 కోట్ల జీఎస్టీ బిల్లొచ్చింది -...

రూ.25 వేల జీతం కోసం అప్లయ్ చేసుకుంటే రూ. 250 కోట్ల జీఎస్టీ బిల్లొచ్చింది – పాపం నిరుద్యోగి


UP man receives Rs 250 crore GST bill :  ఉత్తరప్రదేశ్‌లోని రత్నపురి పోలీస్ స్టేషన్ పరిధిలో బిర్సు అనే గ్రామం ఉంది. అన్ని గ్రామాల్లోలాగే అక్కడి యువకులు కూడా ఏదో ఓ ఉద్యోగం దొరుకకపోతుందా అని తిరుగుతూ ఉంటారు. ఇలా అశ్వనీకుమార్ అనే యువకుడు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓ రోజు అతనికి వాట్సాప్ కాల్ వచ్చింది. మీలాంటి వాళ్ల కోసమే మేము చూస్తున్నామని ఉద్యోగం రెడీగా ఉందని ఆఫర్ ఇచ్చారు. పాతిక వేల జీతం.. ఐదురజుల పని ఇలా చాలా చెప్పారు. దీంతో మహేశ్ కుమార్ తన కష్టాలన్నీ తీరిపోయాయనుకున్నారు. వారు అడిగినట్లుగా కరెంట్  బిల్లు, తన తండ్రి ఆధార్ కార్డు ఇచ్చాడు. అంతే కాదు రిజిస్ట్రేషన్  ఫీజు పేరుతో రూ. 1750  అడిగితే అవి కూడా ఇచ్చాడు. 

ఇక తనకు ఆఫర్ లెటర్ వాట్సాప్ లోనే వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ రోజులు గడుస్తున్నా ఎలాంటి ఆఫర్ లెటర్ రాలేదు. కానీ ఓ రోజు పోస్టు మ్యాన్ మాత్రం ఓ కవర్ తెచ్చి ఇచ్చిపోయాడు.  వాట్సాప్ లో కాకుండా నేరుగా ఆఫర్ లెటర్ పంపారేమో అనుకుని అశ్వనీకుమార్ ఆత్రంగా చూశాడు కానీ.. అతనికి మైండ్ బ్లాంకైపోయింది. ఎందుకంటే.. రూ.250 కోట్లు జీఎస్టీ కట్టాలని వచ్చిన డిమాండ్ నోటీసు అది. ఆ నోటీసును చూసి అశ్వనీకుమార్ కు ఏం చేయాలో అర్థం కాలేదు కానీ అప్పుడు తనకు గుర్తుకు వచ్చింది..తనకు జాబ్ పేరుతో ఆఫర్ చేసి..  ఆధార్ కార్డులు, తన ఇంటి కరెంట్ బిల్లులు తీసుకున్నారని. 

మద్యం మత్తులో జార్జియాకు బదులు ఇండియా ఫ్లైటెక్కేసింది – యువతి నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్

అలా తీసుకున్న వారు అశ్వనీకుమార్ కు ఎలాంటి జాబ్ ఇవ్వకపోగా.. ఆయన తండ్రి పేరు మీద ఓ కంపెనీని రిజిస్టర్ చేశారు. వందల కోట్ల లావాదేవీలు నిర్వహించారు. కానీ ఒక్క రూపాయి జీఎస్టీ కట్టలేదు. దాంతో జీఎస్టీ అధికారులు నోటీసులు పంపించారు. రిజిస్టర్డ్ అడ్రస్ కూడా సొంత గ్రామంలో ఉండటంతో అదే అడ్రస్ కు పంపించారు. ఈ నోటీసులు చూసి అశ్వనీకుమార్ లబోదిబోమంటున్నాడు.  ఆలస్యం చేస్తే తనను జైల్లో వేస్తారన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతనికి వచ్చిన ఫోన్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. 

నడిరోడ్డుపై రేప్‌ – వీడియో తీస్తూ చూసిన జనం – మధ్యప్రదేశ్‌లో ఘోరం

ఆన్ లైన్ ఫ్రాడ్ చేసేందుకు ఇలాంటి కంపెనీలను సృష్టించి … బినామ ఈ వేబిల్లులు క్రియేట్ చేస్తున్నారని పోలీసులు చెప్పారు. ఆన్ లైన్ ఫ్రాడ్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అంటున్నారు. ఆన్ లైన్ ఫ్రాడ్ చేసే వాళ్లకు.. ముక్కూ ముఖం  తెలియని వాళ్లకు ఇలా ఆధార్ కార్డుల డీటైల్స్ ఇస్తే.. ఇలాంటి పరిస్థితులే వస్తాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.                                           

 

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments