Will BJP weaken after Bihar and Maharashtra elections : భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా బలపడింది. అసాధ్యమనుకున్న రాష్ట్రాల్లోనూ గెలిచి చూపించింది. బెంగాల్ వంటి రాష్ట్రాల్లో గెలుపు దగ్గరకు వెళ్లింది. అయితే రాజకీయం అంటేనే రోలర్ కోస్టర్ రైడ్. ఎంత హైకి చేరుకున్నా.. ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ కిందకు రావాల్సిందే. ఎల్లప్పుడూ పైన ఉండలేరు. బీజేపీ వీలైనంత ఎక్కువ కాలం హైలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ తెచ్చుకోలేకపోడం ఓ కారణం అయితే.. రాష్ట్రాల ఎన్నికల్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోడం మరో సమస్య.
బీహార్, జార్ఖండ్, ఢిల్లీ, మహారాష్ట్రల్లో గడ్డు పరిస్థితే
హర్యానా, జమ్మూకశ్మీర్ తర్వాత వచ్చే ఏడాదిలో మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ గెలిచి చాలా కాలం అయింది. కేజ్రీవాల్ న ఈ సారి అయినా ఓడించడం సాధ్యమా అంటే.. కష్టమే అన్న వాదన వినిపిస్తోంది తనను అక్రమంగా బీజేపీ జైల్లో పెట్టిందని తాను నిజాయితీ పరుడ్ని అని నమ్మితే తనకే ఓటు వేయాలని ఆయన ప్రచారం చేయబోతున్నారు. భారత రాజకీయాల్లో సానుభూతికి ఉన్న పవర్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇక మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను చీల్చి చేసిన రాజకీయం ఎదురు తన్నిందని పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆశల్లేవని ఇప్పటికే పలు రిపోర్టులు వెలుగులోకి వచ్చాయి. ఇక బీహార్‌లో నితీష్ కుమార్ నిరంతరం టెన్షన్ పెడుతూనే ఉన్నారు. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ అరెస్టు వ్యవహారం దెబ్బకొడుతుందన్న చర్చ నడుస్తోంది.
అసెంబ్లీ ఎన్నిక్లలో తేడా వస్తే బీజేపీ బలహీనం
అసెంబ్లీ ఎన్నికలకు .. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధం ఉండదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వేరు. బీజేపీ వరుసగా అసెంబ్లీని కోల్పోతే. దేశవ్యాప్తగా వీక్ అయిపోతుందని ప్రచారం ఊపందుకుంటుంది. అలాంటి సిట్యూయే,న్ కోసమే కాంగ్రెస్ కూటమి ఎదురు చూస్తూ ఉంది. ఒక్క సారి అలాంటి ఎఫెక్ట్ వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోదు. బీజేపీని మరింతగా వీక్ చేసేందుకు చేయాల్సిన పనులన్నీ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా పూర్తి మెజార్టీ లేదు. మిత్రపక్షాల మీద ఆధారపడి ఉంది. మైండ్ గేమ్ ఆడటానికి ఇలాంటి రాజకీయం చాలు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో తెలియని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.
సవాళ్లను అధిగమించడంలో బీజేపీకి ప్రత్యేక శైలి !
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తిన్నంత మాత్రాన బీజేపీ పని అయిపోయిందని చేతెలేత్తయడానికి ఆ పార్టీ నేతలు గాలివాటంగా గెలిచేద్దామనుకునే రకం కాదు. లేని విజయాన్ని కూడా శూన్యంలో నుంచి పుట్టించుకోగల సమర్థులు. అందుకే ఒక వేళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగిలినా బీజేపీ అగ్రనేతల ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గదు. కానీ రాజకీయం మాత్రం రసవత్తరంగా మారుతుంది. అందులో సందేహం లేదు.
మరిన్ని చూడండి