Homeజాతీయంగుడి బయట యాచకురాలికి బిచ్చం వేసి అడ్డంగా బుక్కయ్యాడు - వ్యక్తిపై కేసు నమోదు చేసిన...

గుడి బయట యాచకురాలికి బిచ్చం వేసి అడ్డంగా బుక్కయ్యాడు – వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు


Police Case On Person Who Gave Money To Beggar In Indore: గుడి బయట ఉన్న యాచకురాలికి బిచ్చం వేసిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్‌లో (Indore) జరిగింది. భిక్షాటన నిరోధక బృందం అధికారి ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 223 కింద గురువారం ఈ కేసు నమోదైంది. కోర్టులో ఈ నేరం రుజువైతే సదరు వ్యక్తికి రూ.5 వేల జరిమానా లేదా ఏడాది జైలుశిక్ష.. లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది. కాగా.. ఇండోర్ నగరాన్ని తొలి యాచక రహిత నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో స్థానిక అధికార యంత్రాంగం ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి బిచ్చ వేయడం, స్వీకరించడాన్ని నిషేధించింది. ఈ క్రమంలోనే పలువురు బిచ్చగాళ్లను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.

అంతే కాకుండా నగరంలో ఎక్కడైనా భిక్షాటన జరుగుతున్న సమాచారం ఇస్తే రూ.వెయ్యి బహుమతి ప్రకటించారు. గత 3 వారాలుగా నగరంలో చాలామంది ఈ రివార్డులు అందుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాలను యాచక రహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ 10 నగరాలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసింది. ఇండోర్‌తో పాటు ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి.

Also Read: US Red Dye : వంటల్లో రెడ్ కలర్ వినియోగం నిషేధం – అమెరికా కీలక నిర్ణయం – మరి మన సంగతేంటి ?

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments