అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి బడా ఈ-కామర్స్ సంస్థల ఆధిపత్యానికి చరమగీతం పాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఓఎన్ డీసీ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించింది. ప్రస్తుతం దీన్ని 5 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.

ఒఎన్ డిసి అంటే ఏమిటి?
ఆన్లైన్ షాపింగ్ అనగానే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి బడా కంపెనీల పేర్లు గుర్తుకు వస్తాయి. ఈ సంస్థల కార్యకలాపాలు, సులభమైన షాపింగ్ విధానం, సమయం ఆదా, భారీ మొత్తం ఆఫర్‌లు కారణంగా మనకు ఇవి గుర్తుకు వస్తాయి. ప్రకటనలే ఈ కంపెనీలు ప్రజాధరణ పొందడానికి పెద్ద పాత్ర పోషిస్తాయి. అలాంటి ప్రకటనలు చూసే జనం ఈ కంపెనీలపై మక్కువ పెంచుకుంటున్నారు. ఆన్‌లైన్ షాపింగ్‌ చేస్తున్నారు. ఈ-కామర్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, ఈ బడా కంపెనీల ఆధిపత్యానికి చరమగీతం పాడేందుకు భారత ప్రభుత్వం ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.

ఈ ప్లాట్‌ఫామ్‌ ఎందుకు అవసరం?
ఈ ప్లాట్‌ఫామ్‌ అమ్మకందారులు, కొనుగోలుదారులు, డెలివరీ ఏజెంట్లకు ఎలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పెద్ద ఇ-కామర్స్ కంపెనీలకు ఎటువంటి పోటీ ఇస్తుంది.

ఒఎన్‌డిసి అంటే ఏమిటి?
ఓఎన్‌డీసీ అంటే ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. అంటే, దేశంలోని అతిచిన్న వ్యాపారవేత్తలు తమ వస్తువులను డిజిటల్ రూపంలో విక్రయించగల నెట్వర్క్. దీని కోసం తక్కువ కమీషన్ చెల్లించాల్సి ఉంటుంది. విక్రేతలు, కొనుగోలుదారులు, డెలివరీ భాగస్వాములను కనెక్ట్ చేయడానికి ఈ ప్లాట్‌ఫామ్ పనిచేస్తుంది.

ఓఎన్డీసీ అనేది లాభాపేక్షలేని సంస్థ. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆధిపత్యం నుంచి దేశంలోని చిన్న వ్యాపారాలను రక్షించడానికి ఉపయోగపడుతుంది. వారి వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి అవకాశం కల్పిస్తుంది. ఓఎన్డీసీలో రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. జనాలు చేసే ఆర్డర్లపై ఛార్జీలు వసూలు చేస్తారు. కానీ అది అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే తక్కువే.

అవసరం ఎందుకు?
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ ఎందుకు అవసరమైందనే ఆలోచన చాలా మందిలో కలుగుతుంజది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి భారతదేశ ఇ-కామర్స్ మార్కెట్ నిరంతరం పెరుగుతోంది. 2030 నాటికి భారతదేశ మొత్తం జనాభాలో మూడింట ఒక వంతు మంది ఆన్లైన్‌లో షాపింగ్ చేస్తారని ఓ అంచనా. దీంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి బడా విదేశీ కంపెనీలు బాగానే లాభాలు గడిస్తాయి. కాలక్రమేణా, ఈ రంగం పెరిగేకొద్దీ లాభాల వాటా పెరుగుతూనే ఉంటుంది.

విదేశ కంపెనీలు లాభాల బాటపట్టడంతో దేశీయం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడబోతోంది. అంతేకాకుండా అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌ల కారణంగా భారతదేశంలోని చిన్న వ్యాపారవేత్తలను సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి వ్యాపారలపై ప్రభావం చూపిస్తోంది. ఆఫ్‌లైన్‌లో అమ్మకాలు చేయలేక… ఆన్‌లైన్‌లో విక్రయించే స్థోమత లేక వారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆన్‌లైన్‌లో అమ్మాలన్నా భారీగా కమీషన్ వసూలు చేస్తున్నారు.

మంచి రేటింగ్ ఉన్న వస్తువులనే కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తారు. ఈ డిమాండ్ కారణంగా బడా కంపెనీలు కూడా తమ ఉత్పత్తులకు మంచి రేటింగ్ తీసుకొచ్చి విక్రయించడం ప్రారంభించాయి. వాటినే టాప్‌లో చూపిస్తూ ఉంటాయి. ఈ రేటింగ్‌లు కూడా కంపెనీల చేతుల్లో ఉంటాయి.

మాయాజాలం కారణంగా వస్తువుల ధరల్లో కూడా వ్యత్యాసం కనిపిస్తుంది. సాధారణ అమ్మకందారులు మధ్యవర్తుల ద్వారా వస్తువులు విక్రయిస్తారు. ఇ-కామర్స్ కంపెనీలు ఆ వస్తువులను నేరుగా విక్రయిస్తాయి. ఇది ఉత్పత్తి ఖర్చును తగ్గిస్తుంది. ఈ చిన్న తేడా కారణంగా వస్తువు ధరలో భారీ మార్పు వస్తుంది.
అయితే భారత ప్రభుత్వం ఈ-కామర్స్ కంపెనీల ఇన్వెంటరీ మోడల్‌ను నిషేధించింది. కానీ ఈ కంపెనీలు ఏదో విధంగా తమ పని తాము చేసుకుంటూ ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నాయి.
ఓఎన్డీసీతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ పోటీ
ఓఎన్‌డీసీ ప్లాట్ ఫామ్ రాకతో ఇకపై ప్రత్యేక షాపింగ్ యాప్స్ అవసరం లేదు. అదే వెబ్‌సైట్‌ లేదా యూపీఐ యాప్ నుంచి ఓఎన్డీసీని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ వస్తువు కొనాలనుకున్నా చూడవచ్చు. ఓఎన్‌డీసీలోఅమెజాన్, ఫ్లిప్కార్ట్‌తో సహా చిన్న దుకాణదారుల ఉత్పత్తులు, రేట్లు కూడా కనిపిస్తాయి. ప్రతి వస్తువు ధరలను రేటింగ్ చూసిన తరవాత వాటిని నేరుగా ఇక్కడ నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఈ ప్లాట్‌పామ్‌ ప్రయోజనం ఏమిటంటే
ఒక చిన్న దుకాణదారుడు కూడా తన వస్తువులను దూరంగా కూర్చున్న కస్టమర్‌కు విక్రయించవచ్చు. ఓఎన్డీసీలో రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లతో పోలిస్తే ఇక్కడ మీరు ప్రతి ప్రొడక్ట్‌పై ఆఫర్‌ కూడా వస్తుంది. ఎక్కడ తయారైన వస్తువైనా అది చాలా ఫాస్ట్ డెలివరీ అవుతుంది. యుపిఐ వంటి విప్లవంగా ఓన్‌డీసీని అభివర్ణిస్తున్నారు. ఇది రాబోయే కాలంలో పెద్ద గేమ్ ఛేంజర్‌గా మారబోతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Source link