2007 టీ20 వరల్డ్ కప్…2011 వన్డే వరల్డ్ కప్. టీమిండియా క్రికెట్ దశ దిశను మార్చేసిన ప్రపంచకప్పులు ఇవి. మరి ఈ రెండు వరల్డ్ కప్పులు భారత్ ముద్దాడటంతో కీలకపాత్ర పోషించిన క్రికెట్ యోధుడు, క్యాన్సర్ తో పోరాడుతూనే క్రికెట్ ను కొనసాగించిన ధీరుడు యువరాజ్ సింగ్ జీవిత చరిత్ర వెండి తెరపైకి వస్తోంది. టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్, సచిన్ టెండూల్కర్ బయోపిక్ తీసిన రవిభాగ్ చండ్క తో కలిసి యువరాజ్ సింగ్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అన్స్మెంట్ ను ఈ రోజు చేశారు. అయితే ఈ సినిమాలో యువరాజ్ సింగ్ పాత్ర పోషిస్తున్నది ఎవరు…డైరెక్టర్ ఎవరు లాంటి వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. యువరాజ్ సింగ్ వైట్ బాల్ క్రికెట్ లో ఆల్ రౌండర్ గా అద్భుతంగా రాణించగా…ఆ తర్వాత క్యాన్సర్ తో పోరాడి దాని నుంచి కోలుకుని నిజజీవితంలోనూ విజేతగా నిలిచాడు. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తో కలిసి పనిచేస్తుండటంతో పాటు సన్ రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ కెరీర్ ను తీర్చి దిద్ది తన వారసుడిగా భారత క్రికెట్ కు పరిచయం చేశాడు.
క్రికెట్ వీడియోలు
Yuvraj Singh Biopic Announced | రెండు ప్రపంచ కప్పుల విజేత జీవిత చరిత్ర సినిమా రూపంలో | ABP Desam
మరిన్ని చూడండి