టీమిండియా అంటే ఎప్పుడూ బ్యాటర్లే గుర్తొస్తారు. కానీ 2023 వరల్డ్ కప్ మాత్రం అలగ్. మన పేసర్లు ఒక్కో టీమ్ బ్యాటర్లకు పీడకలల్నే మిగిలిచ్చారు. ఫైనల్ కి ముందు పది కి పది మ్యాచ్ లు గెలిచింది టీమిండియా. దానికి ప్రధాన కారణంగా మన బౌలింగ్ తురుపుముక్కలు. మహ్మద్ షమీ..జస్ ప్రీత్ బుమ్రా. షమీ కేవలం 7 మ్యాచుల్లోనే 24వికెట్లు తీసి నిప్పులు నిప్పులు చెరిగాడు అంతే. 10 యావరేజ్ తో షమీ వేసిన స్నేక్ బాల్స్ ను ఆడలేక ఒక్కో టీమ్ కుయ్యో మొర్రో అంది. మరో వైపు బుమ్రా కూడా అంతే…11 మ్యాచ్ ల్లో 20 వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ రేటు 4. ఈ ఇద్దరి దెబ్బకు భారత్ ఫైనల్ వరకూ ఓటమి అనేదే లేకుండా వెళ్లింది.కానీ బ్యాడ్ లక్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం కానీ ఈ ఇద్దరి బౌలింగ్ ప్రతిభకు ప్రధానంగా షమీ బౌలింగ్ అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. అయితే దురదృష్టవశాత్తు షమీ ఆ వరల్డ్ కప్ లో గాయపడ్డాడు. ఫలితంగా రెండేళ్లుగా టీమిండియా లో స్థానం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇటు వైపు జస్ ప్రీత్ బుమ్రా మొన్నటివరకూ ఆసీస్ ను ఆసీస్ లోనే బెంబేలెత్తించి వచ్చాడు. సో ఇప్పుడు నిప్పు నీరు లాంటి ఈ ఇద్దరు బౌలర్లు కలుస్తున్నారు కాబట్టి దుబాయ్ లో ప్రత్యర్థుల దుమ్ము రేగటం ఖాయమని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
క్రికెట్ వీడియోలు
Mohammed shami Jasprit Bumrah CT 2025 | నిప్పులాంటి బుమ్రా…పెను తుపాన్ షమీ తోడవుతున్నాడు | ABP Desam
మరిన్ని చూడండి