అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ ఫోటో. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ని ఎల్ఎస్జీ ఓనర్ గోయెంకా క్లాస్ పీకిన ఫోటో. ఐపీఎల్ 2024లో రాహుల్ మర్చిపోదగ్గ ఇన్సిడెంట్ ఇది. ఆ రోజు నుంచే కేఎల్ రాహుల్ లక్నోను వదిలేయాలని డిసైడ్ అయ్యాడనే వార్తలు వచ్చాయి. కానీ తర్వాత మళ్లీ సంజీవ్ గోయెంక్ రాహుల్ ని పర్సనల్ గా పిలవటం హగ్గులిచ్చిన ఫోటోలు రిలీజ్ చేయటం లాంటివి చేసినా అవేమీ రాహుల్ అన్న ఇగోను శాటిస్ఫై చేసినట్లు లేవు. అందుకే వేలం ముందు టీమ్ నుంచి బయటకు వెళ్లిపోతున్నట్లు చెప్పేసినట్లున్నాడు. ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్ ప్రకటించిన రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాలో కేఎల్ లేడు. రాహుల్ కి బ్యాకప్ కెప్టెన్ గా చేస్తున్న నికోలస్ పూరన్ కి 21కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకుంది లక్నో. ఆ తర్వాత స్పిన్నర్ రవి బిష్ణోయ్, స్పీడ్ గన్ మయాంక్ యాదవ్ కు చెరో 11 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకుంది. అన్ క్యాప్డ్ ప్లేయర్స్ క్యాటగిరీలో మోహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోనీలను నాలుగు కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది లక్నో సూపర్ జెయింట్స్.
క్రికెట్ వీడియోలు
LSG Released KL Rahul Retention Players | కెప్టెన్ కేఎల్ రాహుల్ ను వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ | ABP Desam
మరిన్ని చూడండి