న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ 0-2 తేడాతో కోల్పోయిన టీమిండియా ఆఖరి టెస్టు మ్యాచ్ ను గెలవకపోతే మాత్రం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మీద ఆశలు వదులుకోవాల్సిందే. రీజన్ మనకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కి ముందు ఉన్నది ఇక న్యూజిలాండ్ తో లాస్ట్ టెస్ట్ ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రో ఫీ మాత్రమే. పొరపాటున ఇప్పుడు న్యూజిలాండ్ తో ఆఖరి టెస్టును ఇండియా ఓడిపోతే తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టుల్లో నాలుగు టెస్టులు కనీసం గెలవాల్సి ఉంటుంది. లేదంటే పాయింట్లు భారీగా కోతపడి టీమిండియా ఫైనల్ ఆడే అవకాశం కోల్పోతుంది. న్యూజిలాండ్ తో రెండో టెస్టు ప్రారంభానికి ముందు 68 పాయింట్లతో ఉన్న టీమిండియా రెండో టెస్ట్ ఓటమి తర్వాత 62 కి పడిపోయింది. ఇప్పుడు మనం మొదటి స్థానంలోనే ఉన్నా దాదాపు మన పాయింట్లు ఆస్ట్రేలియా పాయింట్లు సమానం. మూడో స్థానంలో శ్రీలంక, నాలుగో స్థానంలో న్యూజిలాండ్, ఐదో స్థానంలో సౌతాఫ్రికా ఉన్నాయి. మనం ఓడిపోయే ప్రతీ మ్యాచ్ కు లంక, కివీస్, ప్రొటీస్ అవకాశాలు మెరుగవుతూ ఉంటాయి. పైగా మన తర్వాతి సిరీస్ ఆస్ట్రేలియా లో కాబట్టి ఫలితం తారు మారు అయితే మాత్రం వరుసగా రెండుసార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆడిన టీమిండియా ఈసారి ఇంట్లో కూర్చుని వేరే వాళ్లు ఫైనల్ మ్యాచ్ చూసుకోవటమే.
క్రికెట్ వీడియోలు
Ind vs NZ Test Series | WTC 2025 ఫైనల్ ఆడాలంటే టీమిండియా ఇలా చేయాల్సిందే.! | ABP Desam
మరిన్ని చూడండి