అనిశ్చితి..పాకిస్థాన్ క్రికెట్ జట్లు రెండూ కజిన్ బ్రదర్స్. ఎప్పుడు ఎవరి మీద గెలుస్తారో తెలియదు. ఎప్పుడు ఎవరి మీద ఓడిపోతారో తెలియదు. బంగ్లా దేశ్ లాంటి టీమ్ ను సొంత గడ్డకు పిలిపించుకుని టెస్టు మ్యాచ్ ఆడించి చిత్తుగా ఓడిపోయి పిచ్చి చీవాట్లు తింటోంది ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. బంగ్లా చేతిలో పాకిస్థాన్ మొదటి టెస్టులో అనూహ్యం ఓడిపోగా..ఆ ఓడిపోయిన విధానానికి మాజీలకు చిర్రెత్తుకు వచ్చింది. పీసీబీ ఛైర్మన్ నుంచి టీమ్ లో ఆటగాళ్ల వరకూ ఎవ్వరినీ వదలకుండా అందరూ తిట్టిపోస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 448 పరుగులు చేసినప్పుడు చేతిలో ఇంకా నాలుగు వికెట్లు ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అంతే బంగ్లా బ్యాటర్లు ఇదే ఛాన్స్ అనుకుని చెలరేగిపోయి 565పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా స్పిన్నర్లకు బలైపోయి కేవలం 146 పరుగులకే కుప్పకూలిపోయింది. 30 పరుగుల టార్గెట్ ను బంగ్లా ఉఫ్ మని ఊదేసి పాకిస్థాన్ పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అసలు స్పిన్నర్లకు సహకరించే ఈ పిచ్ పై పాకిస్థాన్ టీమ్ ఒక్క స్పిన్నరును కూడా తీసుకోకుండా బరిలోకి దిగటమే టీమ్ అందరినీ తిట్టు తినేలా చేస్తోంది. గెలవాలనే ఇంటెన్షన్ ఉండదు. పిచ్ మీద అవగాహన ఉండదు. ఆ బోర్డుకు ఏ టీమ్ సెలక్ట్ చేస్తున్నామో క్లారిటీనే ఉండదంటూ రషీద్ లతీఫ్, అఫ్రిది లాంటి మాజీ ఆటగాళ్లు, కెవిన్ పీటర్సన్ లాంటి విదేశీ ఆటగాళ్లు గట్టిగా తగులుకుంటున్నారు. ఈ తిట్లు తినలేకపోయాడేమో పీసీబీ ఛైర్మన్ మోసిన్ నక్వీ తెరమీదకు వచ్చాడు. పాకిస్థాన్ క్రికెట్ లో మార్పులు తప్పవని..ఎంత పెద్ద ఆటగాళ్లైనా సరే ఆడకపోతే నిర్దాక్షిణ్యంగా తప్పిస్తామని స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీని మీద ప్లేయర్లు గరం గరం అవుతున్నారు. ఒక్క మ్యాచ్ ఓడిపోయాం ఇన్నేసి మాటలు పడాలా అంటూ వాళ్లూ కౌంటర్ ఇస్తున్నారు. మొత్తం బంగ్లాదేశ్ మీద ఓటమి పాకిస్థాన్ క్రికెట్ లో ఎప్పట్లానే మరో వార్షిక సంక్షోభాన్ని తెచ్చిపెట్టే ఛాన్సులు అయితే కనపడుతున్నాయి.
క్రికెట్ వీడియోలు
Heavy Criticism on Pakistan Cricket Team | పాక్ బోర్డుపై దుమ్మెత్తిపోస్తున్న మాజీలు, సంక్షోభం తప్పదా.?
మరిన్ని చూడండి