దేశంలో ప్రో కబడ్డీ మేనియా ప్రారంభమైంది. ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెషన్‌ సెంటర్‌లో జరిగిన వేలంలో ఆటగాళ్లను దక్కించుకునేందుకు ప్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఆసియా గేమ్స్ 2023లో భారత జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్ పవన్ కుమార్ సెహ్రావత్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. పీకేఎల్ సీజన్‌-10 కోసం జరిగిన వేలంలో తెలుగు టైటాన్స్‌ జట్టు అతడిని రూ. 2.60 కోట్లకు కొనుగోలు చేసింది. 2.60 కోట్లతో ప్రో కబడ్డీ లీగ్‌ 10 సీజన్‌ వేలంలో అత్యధిక ధర పలికిన ఇరాన్‌కు చెందిన మొహమ్మద్‌రెజా షాద్‌లూయీ చియానేహ్‌ రికార్డును పవన్‌ బద్దలుకొట్టాడు. సోమవారం జరిగిన వేలంలో షాద్‌లూయూని పుణేరి పల్టన్‌ రూ.2.35 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ రికార్డును పవన్‌కుమార్‌ సెహ్రావత్‌ బద్దలుకొట్టి ప్రో కబడ్డీ లీగ్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. గత సీజన్‌లో తమిళ్‌ తలైవాస్‌ జట్టు పవన్‌ కుమార్ సెహ్రావత్‌ను రూ. 2.26 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈసారి తెలుగు టైటాన్స్‌ అంతకుమించిన మొత్తంతో అతడిని సొంతం చేసుకుంది. ఇరాన్‌ స్టార్‌ మహ్మద్‌రెజా చియానెహ్ (రూ.2.35 కోట్లు) రెండో ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.

భారత స్టార్‌ మనీందర్‌ సింగ్‌ను రూ. 2.12 కోట్లకు బెంగాల్‌ వారియర్స్‌ దక్కించుకుంది. ఫజల్‌ అత్రాచలి (గుజరాత్‌ టైటాన్స్‌, 1.60 కోట్లు), సిద్ధార్థ్‌ దేశాయ్‌ (హరియాణా స్టీలర్స్‌, రూ.కోటి), మీటూ శర్మ (యూ ముంబా, రూ.93 లక్షలు), విజయ్‌ మలిక్‌ (యూపీ యోధాస్‌, రూ.85 లక్షలు), గమాన్‌ (దబంగ్‌ ఢిల్లీ, రూ.85 లక్షలు), చంద్రన్‌ రంజిత్‌ (హరియాణా స్టీలర్స్‌, రూ.62 లక్షలు), రోహిత్‌ గులియా (గుజరాత్‌ టైటాన్స్‌, రూ.58.50 లక్షలు)భారీ ధరలు పలికారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వేలం ప్రక్రియలో 12 జట్లు పాల్గొన్నాయి.

వేలంలో పాల్గొన్న అన్ని ఫ్రాంచైజీలు ఇరాన్‌ ఆటగాళ్లు ఫజల్‌ అత్రాఛలి, షడోరులను దక్కించుకొనేందుకు పోటీపడ్డాయి. ఏ కేటగిరీ బరిలో వీరంతా ఉన్నారు. అలాగే ఏ కేటగిరీలో హర్యానాకు చెంందిన రోహిత్‌ గులియా, విజరు మాలిక్‌తోపాటు, మణిందర్‌ సింగ్‌(పంజాబ్‌), మంజిత్‌ ఛిల్లర్‌(ఢిల్లీ)ను దక్కించుకొనేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. సోమవారం గ్రూప్‌ ఏ, బి ఆటగాళ్లు వేలం జరగగా.. మంగళవారం గ్రూప్‌ సీ, గ్రూప్‌ డీ ఆటగాళ్లు వేలం జరిగింది.

12 ఫ్రాంఛైజీలు మూడు కేటగిరీల్లో 84 మంది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకున్నాయి. ఇందులో 22 మంది ఆటగాళ్లను ఎలైట్‌ రిటైన్డ్ కేటగిరీ కింద అంటిపెట్టుకున్నాయి. స్టార్‌ ఆటగాళ్లయిన పవన్ సెహ్రావత్, వికాష్ ఖండోలా, సుర్జీత్ సింగ్, సిద్ధార్థ్ దేశాయ్, అభిషేక్ సింగ్, మణిందర్ సింగ్, ఫజెల్ అత్రాచలిలను ఆయా ఫ్రాంఛైజీలు రిటైన్‌ చేసుకోకపోవడంతో వేలంలో పాల్గొని భారీ ధరకు అమ్ముడుపోయారు. స్టార్ రైడర్ పర్దీప్‌ నర్వాల్‌ను యూపీ యోధాస్, అస్లాం ముస్తఫాను పుణెరి పల్టాన్‌ రిటైన్‌ చేసుకున్నాయి. సీజన్‌-9లో మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డు అందుకున్న అర్జున్ దేశ్వాల్‌ను జైపూర్ పింక్ పాంథర్స్ అంటిపెట్టుకుంది. రైడర్లు రజనీష్‌, వినయ్‌తోపాటు డిఫెండర్లు పర్వేష్‌, మోహిత్, నితిన్‌లను తెలుగు టైటాన్స్‌ రిటైన్‌ చేసుకుంది. మూడు కేటగిరీల్లో ఫ్రాంఛైజీలు రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లను జాబితాను ప్రొ కబడ్డీ లీగ్ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.

బెంగాల్‌ వారియర్స్‌, బెంగళూరు బుల్స్‌, దబాంగ్‌ ఢిల్లీ, గుజరాత్‌ జెయింట్స్‌, హర్యానా స్టీలర్స్‌, పింక్‌ ప్యాంథర్స్‌, పట్నా పైరెట్స్‌, పుణేరి పల్టన్స్‌, తమిళ్‌ తలైవాస్‌, తెలుగుటైటాన్స్‌, యు ముంబా, యూపీ యోథా జట్టు.. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌ 10 టైటిల్‌ కోసం పోటీ పడనున్నాయి. డిసెంబర్‌ 2న ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-10 ఆరంభం కానుంది.

Source link