Cricket Australia News: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. స్వదేశంలో పాకిస్థాన్‌తో చివరి టెస్ట్ సిరీస్ ఆడుతున్న.. జనవరి మూడు నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. తన సొంత మైదానంలో మంచి ప్రదర్శన చేసి టెస్టు కెరీర్‌కు ముగింపు పలకాలని వార్నర్ భావిస్తున్నాడు. చివరి టెస్ట్ ఆడనున్న వేళ వార్నర్ (David Warner)పై ఆసీస్ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ప్రశంసల వర్షం కురిపించాడు. మూడు ఫార్మాట్లలో ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహించిన అత్యుత్తమ ఆటగాళ్లలో వార్నర్ ఒకడని మెక్‌డొనాల్డ్ కొనియాడాడు. వార్నర్ అద్బుతమైన ఆటగాడన్న మెక్‌డొనాల్డ్… జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడని కొనియాడాడు. అటువంటి ఆటగాడు ఇప్పుడు టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోబోతుండడం ఆస్ట్రేలియా క్రికెట్‌కు కోలుకోలేని దెబ్బని వార్నర్ అన్నాడు.
పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు వార్నర్ ఎంపిక చేసినప్పుడు ఎన్నో విమర్శలు వచ్చాయన్న ఆసిస్ కోచ్….వాటన్నింటికీ డేవిడ్ భాయ్ తొలి టెస్ట్‌తోనే సమాధానం చెప్పాడని అన్నాడు. ఏదైమైనా వార్నర్ స్థానాన్ని భర్తీ చేయడం తమకు చాలా కష్టమని అంగీకరించాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా వార్నర్ కొనసాగుతున్నాడని గుర్తు చేశాడు.
సొంత మైదానంలో భావోద్వేగ వీడ్కోలు
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సొంత మైదానంలో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడేశాడు. తన కెరీర్‌లో చివరి టెస్టు సిరీస్ ఆడుతున్న డేవిడ్ భాయ్… సొంత మైదానమైన మెల్‌బోర్న్‌లో చివరి ఇన్నింగ్స్ ఆడేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అవుటై పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో ఈ స్టార్ ఓపెనర్ భావోద్వేగానికి లోనయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఔటైన అనంతరం పెవిలియన్ వెళ్తున్న సమయంలో ఈ స్టార్ క్రికెటర్ భావోద్వేగానికి లోనయ్యాడు. బ్యాట్ చూపిస్తూ స్టేడియంలోని అభిమానులకు అభివాదం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న ఈ దిగ్గజ బ్యాటర్‌ను స్టాండ్స్‌లో కూర్చున్న ఫ్యాన్స్ లేచి నిల్చొని చప్పట్లు కొడుతూ అభినందించారు. డ్రెసింగ్ రూమ్‌కు వెళ్తున్న సమయంలో వార్నర్ తన బ్యాటింగ్ గ్లౌజ్‌లను ఓ అభిమానికి ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ ఘటనలో వార్నర్ క్రికెట్ అభిమానులు ప్రశంసలతో ముచెత్తుతున్నారు. ఈ బాక్సింగ్ డే టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన వార్నర్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆరు పరుగులే చేశాడు. జనవరి 3న సిడ్నీ వేదికగా జరగనున్న ఆసీస్-పాక్ మూడో టెస్టు తర్వాత వార్నర్ ఈ సుదీర్ఘ ఫార్మాట్ కెరీర్‌ను ముగించనున్నాడు. సొంత మైదానమైన మెల్‌బోర్న్‌లో ఈ లెఫ్ట్‌హ్యాండర్‌కు మంచి రికార్డే ఉంది. ఇక్కడ ఆడిన 18 ఇన్నింగ్స్‌లలో డేవిడ్ భాయ్ 50.66 సగటుతో 912 పరుగులు సాధించాడు.
మరోవైపు ఈ ఏడాది అంతర్జాతీయంగా అత్యుత్తమంగా రాణించిన 11 మంది ఆటగాళ్లతోక్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. 2023 ఏడాది ముగుస్తున్న వేళ… 2023లో అద్భుతంగా రాణించిన 11 మంది ఆటగాళ్లతో అత్యుత్తమ జట్టును ప్రకటించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
బెస్ట్ టెస్ట్ జట్టు 2023 : ఉస్మాన్ ఖవాజా, దిముత్ కరుణరత్నే, కేన్ విలియమ్సన్, జో రూట్, బ్రూక్, టక్నర్(వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), రబాడ, స్టువార్ట్ బ్రాడ్.