Homeక్రీడలువారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు

వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు


Kohli’s One 8 Commune pub: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి బెంగళూరు షాకిచ్చింది. అదేంటి ఐపీఎల్లో బెంగళూరు ఫ్రాంచైజీ రాయల్ చాలేంజర్స్ బెంగళూరు తరపున ఆడే కోహ్లీ.. అదే సిటీ షాకివ్వడం ఏంటని కంగారు పడుతున్నారా..? నిజానికి బృహన్ బెంగళూరు మహనగర పాలికే (బీబీఎంపీ) అధికారులు కోహ్లీ నడుపుతున్న 1 8 కమ్యూన్ అనే పబ్బుకు నోటీసులు పంపించారు. ఈ పబ్ ను గతేడాది డిసెంబర్ లో చిన్నస్వామి స్టేడియానికి పరిసరాల్లో ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం నోటీసులు జారీ చేయడం వెనుక ఒక కారణం ఉంది.

ఎన్వోసీ లేదని..
నిజానికి ఏదైన పబ్ ను ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా ఫైర్ సేఫ్టీ అధికారుల నుంచి నో అబ్జేక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసిన తర్వాత ఈ సర్టిఫికేట్ ను సదరు అధికారులు జారీ చేస్తారు. అయితే అలాంటి సర్టిఫికేట్ ఏదీ లేకుండా ఈ పబ్బును నడుపుతున్నట్లు సామజిక కార్యకర్త వెంకటేశ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన బీబీఎంపీ అధికారులు.. ఆ ఫిర్యాదు నిజమేనని తేల్చి, వారం రోజుల్లోగా సర్టిఫికేట్ సమర్పించాలని గడువు విధించారు. గడువు లోపల సర్టిఫికేట్ సమర్పించకపోతే, లీగల్ యాక్షన్ తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. అయితే ప్రస్తుతం ఈన నోటీస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే దీనిపై పబ్ నిర్వాహకులు ప్రస్తుతానికి స్పందించలేదు. 

Also Read: Ind Vs Aus Series: అదరగొడుతున్న బుమ్రా.. ఆ లోపాలు సరిదిద్దుకుంటే కోహ్లీ, రోహిత్‌కు తిరుగుండదు

గతంలోనూ వివాదాలు.. 
నిజానికి 1 8 కమ్యూన్ పబ్ పై గతంలోనూ వివాదాలు ఉన్నాయి. గత జూన్ లో పోలీసులు.. పబ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. నిర్ణీత సమయానికి మించి పబ్బును నడిపినందుకుగాను పోలీసులు పబ్బుపై దాడి చేసి కేసు నమోదు చేశారు. నిజానికి అర్ధరాత్రి 1 గంట వరకే పబ్బును నడిపేందుకు అనుమతి ఉంది. అయితే రాత్రి 1.30 గడిచిన పబ్బును మూసేయ్యలేదని నిర్ణయించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ పబ్బుపై స్థానికులు కూడా పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. లౌడ్ సౌండ్, డిస్టర్బెన్స్ తమకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయి. ఏదేమైనా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ గా భారతీయుల్లో అభిమానం సంపాదించిన కోహ్లీకి ఈ పబ్ కారణంగా కాస్త చెడ్డ పేరు వచ్చేలాగా ఉందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ పబ్బుకు కోల్ కతా, ముంబై, ఢిల్లీ, పుణేలో కూడా బ్రాంచ్ లు ఉన్నాయి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. ఆ దేశ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా నాలుగో టెస్టును ఆడేందుకు మెల్ బోర్న్ కు జట్టుతో కలిసి పయనమయ్యాడు. ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన కోహ్లీ ఒక సెంచరీ నమోదు చేశాడు. 

Also Read: Look Back 2024: ఐపీఎల్‌ 2024లో దబిడిదిబిడే .. అభిమానులకు ఫుల్లు పైసా వసూల్.. ఊహకందని ఆటతీరుతో రికార్డుల పరంపర

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments