If The Qualifier 1 Match Is Canceled Due To Rain Who Will Be The Winner: ఐపీఎల్(IPL)లో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. లీగ్ దశలో 20 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న కోల్‌కత్తా(KKR), 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన సన్ రైజర్స్(SRH) జట్ల మధ్య నేడు క్వాలిఫయర్ -1 మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఫైనల్ కు అర్హత సాధించాలని ఇరు జట్లు గట్టి కసరత్తు చేస్తున్నాయి. పరుగుల వరద పారించడంలో.. ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. చివరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ పై భారీ లక్ష్యాన్ని ఛేదించిన నేపథ్యంలో కమిన్స్ నేతృత్వంలోని సన్ రైజర్స్ జట్టు క్వాలిఫయర్ -1లోనూ గెలుపుపై ధీమాతో ఉంది. మరోవైపు కోల్ కతా చివరి మ్యాచ్ రాజస్థాన్ తో వర్షం కారణంగా రద్దయినప్పటికీ… అంతకుముందు వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో నెగ్గడంతో నైట్ రైడర్స్ కూడా విశ్వాసంతో ఉంది. సన్ రైజర్స్ తో గత 9 మ్యాచ్ ల్లో…… కోల్ కతా ఏడు నెగ్గింది. కేకేఆర్ ప్లేఆఫ్స్ లో 8 మ్యాచ్ లు నెగ్గి, ఐదు ఓడిపోగా.. సన్ రైజర్స్ 5 మ్యాచ్ లు గెలిచి, ఆరు ఓడింది. ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే ఫైనల్ చేరేదెవరన్న ప్రశ్న అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.
వర్షం వల్ల రద్దైతే
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మే 13న గుజరాత్ టైటాన్స్(GT), కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. మే 16న సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం వల్లే అసంపూర్తిగా జరిగింది. దీంతో హైదరాబాద్-కోల్‌కత్తా మధ్య జరిగే తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌కు ఒకవేళ వర్షం అడ్డంకిగా మారుతుందేమో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ వరుణుడు వల్ల మ్యాచ్ రద్దు చేస్తే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. క్వాలిఫయర్-1 మ్యాచులో వర్షం పడితే కనీసం 5-5 ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. ఇది సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. అది కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్ రద్దు చేస్తారు. పాయింట్ టేబుల్ ప్రకారం ఎక్కువ పాయింట్లు రన్‌రేట్ ఉన్న జట్టును విజేతను అనౌన్స్ చేస్తారు. ఈ లెక్కన పాయింట్ల పట్టికలో టాప్‌లో అన్న కోల్‌కతా క్వాలిఫయర్-1లో విజేతగా నిలుస్తుంది.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇలా…
క్వాలిఫయర్-2లోనూ వర్షం వల్ల ఇబ్బంది పడితే క్వాలిఫయర్-1లానే నిబంధనల ప్రకారం విజేతను ప్రకటిస్తారు. కానీ ఫైనల్లో మాత్రం నిబంధనలు కాస్త వేరుగా ఉంటాయి. ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉందా లేదా అనేది ప్రస్తుతానికి తెలీదు. అయితే గతేడాది ఫైనల్ మ్యాచ్ రిజర్వ్ డే ఉంది. ఇప్పుడు కూడా మే 26న చెన్నై చిదంబరం స్టేడియంలో జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో ఫలితం రాకపోతే మే 27న ఫైనల్ నిర్వహించే అవకాశం ఉంటుంది.
మరిన్ని చూడండి