Ravindra Jadeja News: టీమిండియా వన్డే జట్టులో పోటీ మాములుగా లేదు. సీనియర్ ప్లేయర్లు తరచూ విఫలమవుతుండటంతో వారి ప్లేస్ లో సత్తా చాటేందుకు యువ ప్లేయర్లు తహతహలాడుతున్నారు. స్టార్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మలకు ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్, ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కెరీర్లో చివరిది కావచ్చని ఊహగానాలు చెలరేగుతున్నాయి.
మరో వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా వన్డేల్లో గడ్డుకాలం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ కు తనను ఎంపిక చేయకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. వరుణ్ చక్రవర్తి లేదా అక్షర్ పటేల్ లలో ఎవరైనా ఒకరిని జట్టులోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. గణాంకాలను బట్టి, ఈ ఇద్దరిలో ఎవరైనా ఒకరు జడేజా వారసునిగా వన్డేల్లో బరిలోకి దిగే చాన్స్ ఉంది.
ప్రపంచ కప్పే ఆఖరుది..
2023లో సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ లో చివరి సారిగా భారత్ తరపున బరిలోకి దిగాడు. ఆ తర్వాత జడ్డూను మళ్లీ జట్టులోకి తీసుకోలేదు. గతేడాది భారత్ కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడింది. అది కూడా శ్రీలంకతో.. కోహ్లీ, రోహిత్ వంటి స్టార్లు బరిలోకి దిగారు. అయితే జడ్డూకు మాత్రం మొండి చేయి చూపించారు. ఈ క్రమంలో త్వరలో ఇంగ్లాండ్ తో జరగబోయే మూడు వన్డేల సిరీస్ లో తను ఆడబోయేది అనుమానమే అని పలువురు వాదిస్తున్నారు. జట్టుకు యువ రక్తాన్నిఅందించే క్రమంలో వరుణ్ చక్రవర్తి లేదా అక్షర్ లలో ఎవరైనా ఒకరికి ఈ సిరీస్ లో ఓటేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇంగ్లాండ్ సిరీస్ లో రాణిస్తే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపికయ్యే అవకాశముందని తెలుస్తోంది.
లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో అదరగొడుతున్న చక్రవర్తి..
మూడేళ్ల తర్వాత గతేడాది టీమిండియాలలోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి చక్రవర్తి అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు 7 టీ20లు ఆడి, 17 వికెట్లు తీశాడు. అందులో అతని స్ట్రైక్ రేట్ కళ్లు చెదిరే రీతిలో కేవలం9.8గా నమోదైంది. టీమిండియా వన్డే జట్టులో చోటుపై కన్నేసిన వరుణ్.. దేశవాళీల్లో అదరగొడుతూ, సెలెక్టర్ల పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. డొమెస్టిక్ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగిన వరుణ్.. ఆరు మ్యాచ్ ల్లోనే 13.89 స్ట్రైక్ రేట్ తో 18 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రాజస్థాన్ పై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
మరోవైపు అక్షర్ కు అంతర్జాతీయ అనుభవం బోలెడు ఉంది. ఇక తను ఆల్ రౌండర్ గా అటు బ్యాట్, ఇంటు బంతితో ఎఫెక్టివ్ గా ఉంటుండటంతో తను కూడా టీమిండియాలోకి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఇప్పటికే సంధి దశలో ఉన్న యువ టీమిండియా జట్టు.. అదరగొడుతోంది. అలాగే వన్డేల్లో దుమ్ము రేపాలని అభిమానులు కోరు కుంటున్నారు.
మరిన్ని చూడండి