Aus Vs Ind: వెటరన్ పేసరల్ మహ్మద్ షమీ, భారత కెప్టెన్ రోహిత్ శర్మ సంబంధాలు అంతా బాగా లేవని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సొంతగడ్డపై న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ నుంచే వీరిద్ధరి మధ్య పొరపొచ్చాలు వచ్చినట్లు ఊహగానాలు చెలరేగాయి. ముఖ్యంగా షమీ ఫిట్ నెస్ పై రోహిత్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి చాలా కాలంగా జట్టుకు దూరమైన షమీ.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొంది కోలుకున్నాడు. ఆ తర్వాత అతడు డొమిస్టిక్ క్రికెట్లోనూ రంగంలోకి దిగాడు. అటు రంజీలతోపాటు, ఇటు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో తనకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో టీమిండియాలోకి ఎంట్రీకి రెడీ అని సంకేతాలు పంపాడు. అయితే ఇదే విషయమై కివీస్ సిరీస్ సందర్భంగా రోహిత్ ను అడిగినప్పుడు రాబోయే ఆసీస్ సిరీస్ కు తను వంద శాతం ఫిట్ గా లేడని సమాధానమిచ్చాడు.

బెంగళూరులో రోహిత్ ను కలిసిన షమీ..
బెంగళూరులో న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు సందర్భంగా రోహిత్ ను షమీ కలిశాడు. ఆ సందర్భంగా తన ఫిట్ నెస్ గురించి రోహిత్ తో షమీ వాదనకు దిగినట్లుగా మీడియా కథనాలు వెలువడ్డాయి. తను ఫిట్ గా ఉన్నప్పటికీ కివీస్, ఆసీస్ తో జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్ లకు రోహిత్ తనను పరిగణనలోకి తీసుకోవడం లేదని షమీ భావిస్తున్నట్లుగా సమాచారం.

అడిలైడ్ ఓటమితో షమీకి గేట్లు తెరిచిన రోహిత్..!!
అయితే అడిలైడ్ లో జరిగిన రెండో టెస్టులో పేసర్లలో జస్ ప్రీత్ బుమ్రా మినహా సిరాజ్, హర్షిత్ రాణా అంతగా ఆకట్టుకోలేక పోయారు. ఆ టెస్టులో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచడంలో విఫలమై భారీగా పరుగులు సమర్పించుకుని, ఓటమికి ఒక రకంగా వీరిద్దరు కారణమయ్యారు. ఈ క్రమంలో టీమిండియాలోకి షమీ రాకను రోహిత్ స్వాగతించాడు. అయితే అతను కచ్చితంగా నూటికి నూరు శాతం ఫిట్ గా ఉండాలని ఆకాంక్షించాడు. చాలాకాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్న క్రమంలో షమీ ఫిట్ నెస్ పై దృష్టి సారించినట్లు తెలిపాడు. తను నేరుగా వచ్చి, అద్భుతమైన ప్రదర్శన కనబర్చాలనే ఒత్తిడి తనపై పెట్టబోమని పేర్కొన్నాడు. షమీని నిత్యం ఒక టీమ్ గమనిస్తోందని, వాళ్ల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత షమీని జట్టులోకి తీసుకుంటామని తెలిపాడు. నిజానికి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నుంచి ఈ మానిటరింగ్ బాగా జరుగుతున్నట్లు నాలుగు ఓవర్లు వేసిన తర్వాత షమీ స్థితి ఎలా ఉందనే దానిపై చర్చ జరిగిందని, తను టెస్టుల్లో 20వ ఓవర్లు వేయగలడా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. అయితే టీమిండియాలోకి షమీ ఏ క్షణమైనా రావొచ్చని ముక్తాయించాడు. మరోవైపు ఈ సిరీస్ లో నాలుగు ఇన్సింగ్స్ లో 2.50 ఎకానమీతో బుమ్రా 12 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. అయితే 3.36 ఎకానమీతో తొమ్మిది వికెట్లు పడగొట్టి సిరాజ్ ఫర్వాలేదనిపించగా, 4.51 ఎకానమీతో నాలుగు వికెట్లు తీసిన హర్షిత్ పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో బుమ్రాకు సహాకారం అందించేందుకు గాను ఎక్స్పీరియన్స్డ్ పేసర్ అయిన షమీని జట్టులోకి తీసుకురావాలని మాజీలు సహా భారత అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

Source link