Homeక్రీడలురోహిత్‌ అయితేనే సమర్థుడు , టీ 20 ప్రపంచకప్‌ కెప్టెన్సీపై గంభీర్‌

రోహిత్‌ అయితేనే సమర్థుడు , టీ 20 ప్రపంచకప్‌ కెప్టెన్సీపై గంభీర్‌


T20 World Cup 2024: వన్డే ప్రపంచకప్‌(World Cup)  భారత(Bharat) ప్రస్థానం ఓటమితో ముగిసింది. ఫైనల్లో ఓటమితో జట్టుతో సహా క్రికెట్‌(Cricket) అభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. కానీ ఓటమితో ఆగిపోతే భవిష్యత్తును నిర్మించలేమని భావించిన క్రికెటర్లు.. భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వన్డే ప్రపంచకప్‌ త్రుటిల్లో చేజారినా వచ్చే ఏడాది టీ 20(T20) ప్రపంచకప్‌ జరగనుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌ను రెండోసారి కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా సిరీస్‌లో విధ్వంసకర వీరుడు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.  హార్దిక్‌ పాండ్యా కోలుకుని జట్టులోకి వస్తే హార్దిక్‌కు టీ 20 పగ్గాలు అప్పజెప్పనున్నారు. ఇలా టీ 20 కెప్టెన్సీపై బీసీసీఐ ఓ స్పష్టతతో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే టీ 20 ప్రపంచకప్‌ కెప్టెన్‌ విషయంలో… మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌(Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడైతేనే జట్టును సమర్థంగా నడిపిస్తాడని కామెంట్‌ చేశాడు.

వచ్చే టీ20 వరల్డ్‌ కప్‌లో టీమ్‌ఇండియాను రోహిత్ శర్మనే నడిపించాలని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. ఆ జట్టులో విరాట్ కోహ్లీకి కూడా స్థానం ఇవ్వాలని సూచించాడు. వరల్డ్‌ కప్‌ కోసం ప్రకటించే జట్టులో రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ ఉండి తీరాల్సిందేనని గంభీర్‌ వెల్లడించాడు. భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రోహిత్‌ శర్మకే ఇవ్వాలని కూడా అన్నాడు. హార్దిక్‌ పాండ్యనే టీ 20 కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడని తనకు తెలుసని…కానీ సారధిగా రోహిత్ అయితేనే జట్టు బాగుంటుందని గంభీర్‌ అన్నాడు. వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్ సారథ్యం అత్యద్భుతమన్న గంభీర్‌.. అందుకే టీ20ల్లోకి రోహిత్‌ను తీసుకోవాలని సూచించాడు. రోహిత్‌ శర్మ టీ20 ప్రపంచకప్‌లో ఆడాలనే నిర్ణయం తీసుకోవాలని.. అతడిని కేవలం బ్యాటర్‌గా మాత్రమే కాకుండా కెప్టెన్‌గానే ఎంపిక చేయాలిని  గౌతమ్‌ గంభీర్‌ తెలిపాడు. 

వన్డే ప్రపంచ కప్ 2023లో ఓటమి తరువాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. అంతర్జాతీయంగా టీ20 మ్యాచ్ లు ఆడకూడదని హిట్ మ్యాన్ భావిస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే రోహిత్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడని బీసీసీఐ వర్గాల సమాచారం. బీసీసీఐకి సంబంధించిన వ్యక్తి పీటీఐకి ఈ విషయాన్ని తెలిపారు. ఇదే నిజమైతే టీ20లలో రోహిత్ బ్యాట్ నుంచి మెరుపు ఇన్నింగ్స్ లు, శతకాలు చూడలేం అని ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

వాస్తవానికి రోహిత్ శర్మ ఏడాది కాలం నుంచి అంతర్జాతీయంగా పొట్టి ఫార్మాట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. నవంబర్ 2022లో టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ ఓటమి తరువాత హిట్ మ్యాన్ రోహిత్ టీ20 ఫార్మాట్ కు దూరంగా ఉన్నాడని తెలిసిందే. వన్డే ప్రపంచ కప్ మీద ఫోకస్ చేసిన కారణంగా రోహిత్ టీ20లకు దూరంగా ఉన్నాడని అంతా భావించారు. అయితే వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తరువాత రోహిత్ వైట్ బాల్ క్రికెట్ ప్లాన్ పై బీసీసీఐ అతడితో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రోహిత్ ఇక అంతర్జాతీయంగా టీ20 ఫార్మాట్ లో భారత్ కు ప్రాతినిథ్యం వహించడనే వార్త వైరల్ అవుతోంది. 36 ఏళ్ల భారత కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ తరఫున 148 టీ20లు ఆడాడు. పొట్టి ఫార్మాట్లో 4 సెంచరీలు బాదిన హిట్ మ్యాన్ 140 స్ట్రైక్ రేట్‌తో 3,853 పరుగులు సాధించాడు. 



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments