India Vs Bangladesh 2nd Test Match Highlights : బంగ్లాదేశ్(Bangladesh) తో రెండో టెస్టులో టీమిండియా(India) ఘన విజయం సాధించింది. కేవలం రెండున్నర రోజులు మాత్రమే జరిగిన ఈ టెస్టు మ్యాచులో విజయం సాధించి భారత జట్టు చరిత్ర సృష్టించింది. తొలి ఇన్నింగ్స్ లో టీ 20 ఆటతీరుతో అదరగొట్టి వేగంగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. తర్వాత రెండో టెస్టులో బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించింది. బంగ్లాను కేవలం 146 పరుగులకే కుప్పకూల్చి విజయానికి బాటలు వేసుకుంది.
బంగ్లా బ్యాటర్లలో షద్మాన్ ఇస్లామ్ (50), ముష్ఫికర్ రహీమ్ (37) మినహా ఎవరూ రాణించలేదు. దీంతో భారత్ ఎదుట 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లా ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 233 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 285/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 95 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది.యసశ్వీ జైస్వాల్ అర్ధ సెంచరీతో మరోసారి చెలరేగాడు. 51 పరుగులు చేసి జైస్వాల్ అవుటయ్యయాడు. విరాట్ కోహ్లీ 29 పరుగులతో నిలబడ్డాడు. దీంతో కేవలం 17 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ ను భారత జట్టు 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.
2ND Test. India Won by 7 Wicket(s) https://t.co/VYXVdyNHMN #INDvBAN @IDFCFIRSTBank
— BCCI (@BCCI) October 1, 2024
మరిన్ని చూడండి