Rohit declares! India 430/4 : టీమ్ఇండియా యువ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. వ‌రుస‌గా రెండు టెస్టు మ్యాచుల్లో డ‌బుల్ సెంచ‌రీలు చేశి అదరగొట్టాడు. మరోవైపు అరంగేట్రం బ్యాట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌ వ‌రుస‌గా తన రెండో హాఫ్ సెంచ‌రీ సాధించాడు. అయితే ఇద్ద‌రూ దూకుడుగా ఆడుతున్న స‌మ‌యంలోనే 430/4 వ‌ద్ద‌ భార‌త కెప్టెన్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దాంతో, భారత్ ఇంగ్లండ్‌కు 557 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

ఓవర్‌ నైట్‌ స్కోరు 196/2తో మూడో నాలుగో రోజు ఆట మొదలు పెట్టిన టీం ఇండియా బ్యాటర్ లు దూకుడు ప్రదర్శించారు. శుభ్‌మన్‌ గిల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌లు ఛాన్స్ దొరికినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించడంతో టీమిండియా వేగంగా పరుగులు రాబట్టింది. రెండో టెస్టులో సెంచరీ కొట్టిన గిల్‌.. ఈ సారి కుల్‌దీప్‌ యాదవ్‌తో సమన్వయ లోపంతో సెంచరీకి మరో 9 పరుగుల దూరంలో రనౌట్‌ అయ్యాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ ఓ సిక్స్‌, 3 ఫోర్లు తో 27 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు.

గిల్ తరువాత బరిలో దిగిన సెంచరీ హీరో యశస్వి జైస్వాల్.. వచ్చీరాగానే వీర బాదుడు మొదలు పెట్టాడు. జో రూట్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 231 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స‌ర్లు సాయంతో డ‌బుల్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. విశాఖ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన జైస్వాల్.. రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లోనూ ద్విశ‌త‌కాన్ని అందుకున్నాడు. అరంగేట్రం బ్యాట‌ర్ సర్ఫరాజ్‌ ఖాన్‌ సైతం మెరుపులు మెరిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మాదిరిగానే రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్‌ సెంచరీ చేశాడు. 72 బంతుల్లో 3 సిక్స్‌లు, 6 ఫోర్‌లతో కలిపి 68 పరుగులు చేశాడు. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన్అ భారత్ అటు ఇంగ్లాండ్ ను కూడా 319 పరుగులకు పరిమితం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 430/4 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. దీంతో ఇంగ్లీష్ జట్టు ముందు 557 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది.

మూడవ రోజు కూడా యశస్వి జైస్వాల్ వన్డే తరహా బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. సాధికారికంగా బ్యాటింగ్ చేసిన జైస్వాల్ గత రోజున 133 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో 104 పరుగులు చేసి భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. అనంతరం వెన్ను నొప్పితో బాధపడుతూ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు.

Source link