IPL 2024: హైదరాబాద్ సన్ రైజర్స్‌ను ఓడించి ఐపీఎల్ ట్రోఫీని అందుకున్నాక కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్ల ఆనందానికి అవధులే లేవు. అయితే కప్ తీసుకున్న సందర్భంగా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్స్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ముఖ్యంగా చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్‌కు పెద్ద ఎత్తున్న సీఎస్కే ఫ్యాన్స్ తరలివచ్చారు. ఎల్లో జెర్సీలతోనే మ్యాచ్‌కు హాజరైన చాలా మంది తమ మద్దతును ఇండియన్ ప్లేయర్ కెప్టెన్‌గా ఉన్న కేకేఆర్‌కు తెలియచేశారు. గతంలో ధోని సీఎస్కే తర్వాత తనకు నచ్చిన ఐపీఎల్ టీమ్ కేకేఆర్ అని చెప్పటం కూడా ఇందుకు ఓ కారణం.
మ్యాచ్ గెలిచిన తర్వాత గ్రౌండ్ మొత్తం కలియ తిరుగుతున్న షారూఖ్ ఖాన్‌కు ఓ చోట సీఎస్కే, ధోని నినాదాలు వినిపించాయి. అక్కడే ఆగిపోయిన షారూఖ్ తనకి కూడా ధోని అంటే ఇష్టమంటూ సైగ చేశాడు. అంతే కాదు స్వయంగా కేకేఆర్ ఓనర్ అయ్యి ఉండి సీఎస్కే సీఎస్కే అంటూ ఫ్యాన్స్‌తో నినాదాలు చేశాడు. షారూఖ్ చేసిన పనికి హీరోయిన్ అనన్యా పాండే, షారూఖ్ కూతురు సుహానా ఖాన్ ఆశ్చర్యపోవటం కనిపించింది. తమకు టీమ్‌కు సపోర్ట్ చేసిన ధోనికి, సీఎస్కే ఫ్యాన్స్‌కి ట్రిబ్యూట్ ఇచ్చాడు షారూఖ్.
ఐపీఎల్ ట్రోఫీ అందుకునే సమయంలో శ్రేయస్ అయ్యర్ తన ఆరాధ్య ఆటగాడు ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీని ఇమిటేట్ చేశాడు. 2022లో అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్‌ను గెల్చుకున్నప్పుడు కెప్టెన్ మెస్సీని ట్రోఫీని అందుకుని నడుం వంచి ఊగుతూ వస్తాడు టీమ్ కూడా ఓ రేంజ్ వైబ్‌తో దాన్ని ఎంజాయ్ చేస్తారు. అచ్చం దాన్నే కేకేఆర్ ప్లేయర్లతో కలిసి రీక్రియెట్ చేయటం ద్వారా మెస్సీకి ట్రిబ్యూట్ ఇచ్చాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.
బీసీసీపై షారూఖ్ ఖాన్ మాస్ ట్రోలింగ్
ఈ ఏడాది కేకేఆర్ బౌలర్ హర్షిత్ రానా వివాదాస్పదమయ్యాడు. ఈ సీజన్‌లో కేకేఆర్ తమ తొలి మ్యాచ్ సన్ రైజర్స్‌తో ఆడగా..ఆ మ్యాచ్‌లో SRH ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను హర్షిత్ రానా అవుట్ చేశాడు. అయితే వికెట్ తీసిన తర్వాత మయాంక్‌కు హర్షిత్ రానా ఫ్లైయింగ్ కిస్ ఇవ్వటం మయాంక్ దానిపై సీరియస్ అవ్వటం జరిగిపోయాయి. హర్షిత్ రానా మ్యాచ్ ఫీజులో మొదటి తప్పుగా పదిశాతం కోత విధించారు. ఆ తర్వాత మ్యాచుల్లో కూడా హర్షిత్ రానా అలానే వికెట్లు తీసి ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తుండటంతో బీసీసీఐ ఏకంగా అతనిపై ఓ మ్యాచ్ నిషేధం విధించింది.
నిషేధం తర్వాత తిరిగి వచ్చిన హర్షిత్ రానా ఫ్లైయింగ్ కిస్‌లు ఇవ్వటం మానేశాడు. ఇది మనసులో పెట్టుకున్నాడో ఏమో కేకేఆర్ ఓనర్ షారూఖ్ ఖాన్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత హర్షిత్ రానా దగ్గరకు వెళ్లాడు. తనను ఎత్తుకోవాలని హర్షిత్ రానాను అడగ్గా హర్షిత్‌కు ఏం అర్థం కాలేదు. బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ తమ టీమ్ ఓనర్ షారూఖ్ ఖాన్ అలా అడిగే సరికి షాకైన హర్షిత్ రానా షారూఖ్‌ను ఎత్తుకుని విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఆ తర్వాత టీమ్ మొత్తాన్ని కప్ అందుకున్న తర్వాత నేను వన్ టూ త్రీ అంటానూ మనందరం ఫ్లైయింగ్ కిస్‌లు ఇద్దాం అంటూ పెద్ద ప్లానే చేశాడు. నిజంగానే కప్ అందుకున్న తర్వాత అందరూ కలిసి ఫ్లైయింగ్ కిస్‌లు ఇచ్చేలా చేశాడు షారూఖ్. దీంతో అతను చెప్పాలనుకున్నది ఒక్కటే. ఫ్లైయింగ్ కిస్ ఇవ్వటం నేరమేం కాదు. అదొక సెలబ్రేషన్. దాన్నెందుకు బీసీసీఐ పెద్దది చేసి చూడటం అని.. ఇప్పుడు కప్పు గెలిచాం..టీమ్ మొత్తం ఫ్లైయింగ్ కిస్‌లు ఇస్తున్నాం ఏం చేసుకుంటారో చేసుకోండని బీసీసీఐ నిర్ణయాలను మాస్‌గా ట్రోల్ చేశాడు. యంగ్ స్టర్ తన టీమ్ మెంబర్ అయిన హర్షిత్ రానాకు టీమ్ మొత్తం అండగా ఉందనే ధైర్యాన్ని ఇచ్చాడు షారూఖ్ ఖాన్.
మరిన్ని చూడండి