Homeక్రీడలుమెరిసిన హైదరాబాద్‌ బౌలర్లు, సన్‌రైజర్స్ లక్ష్యం 166

మెరిసిన హైదరాబాద్‌ బౌలర్లు, సన్‌రైజర్స్ లక్ష్యం 166


SRH Vs LSG IPL 2024 Match 57 Innings :  లక్నో(LSG)తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) బౌలర్లు సత్తా చాటారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ సరైన ప్రదర్శన చేయని హైదరాబాద్‌ బౌలర్లకు… కీలకమైన మ్యాచ్‌లో… రాణించారు. లక్నో బ్యాటర్లను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్ల ప్రదర్శనతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి  లక్నో కేవలం 165 పరుగులకే పరిమితమైంది. పిచ్‌ బౌలర్లకు అనుకూలిస్తున్న వేళ దూకుడు మీదున్న  హైదరాబాద్‌ బ్యాటర్లను లక్ష్య ఛేదన చేయకుండా లక్నో బౌలర్లు అడ్డుకోగలరేమో చూడాలి.

ఆరంభం నుంచి తడబ్యాటే
  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో బ్యాటింగ్‌కు దిగింది. భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు లక్నో బ్యాటర్లు చాలా ఇబ్బంది పడ్డారు. బంతిబంతికి ఇబ్బందిపడ్డ లక్నో బ్యాటర్లు…. పరుగులు చేసేందుకు చాలా కష్టపడ్డారు. తొలి ఓవర్‌ వేసిన భువనేశ్వర్‌ మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. పాట్‌ కమిన్స్‌ వేసిన రెండో ఓవర్‌లో పది పరుగులు రావడంతో లక్నో భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ మూడో ఓవర్‌లో భువీ…. లక్నోను తొలి దెబ్బ తీశాడు. భువనేశ్వర్‌ కుమార్‌ వేసిన ఓవర్‌లో నితీశ్‌రెడ్డి బౌండరీ లైన్‌ వద్ద పట్టిన అద్భుత క్యాచ్‌కు క్వింటన్‌ డికాక్‌ అవుటయ్యాడు. రెండు పరుగులు మాత్రమే చేసిన డికాక్‌ పెవిలియన్‌ చేరాడు. 13 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత భువీ లక్నోకు మరో షాక్‌ ఇచ్చాడు. మూడు పరుగులు చేసిన స్టోయినిస్‌ని భువి అవుట్‌ చేశాడు. దీంతో 23 పరుగులకే లక్నో రెండు వికెట్లు కోల్పోయింది. హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో లక్నో పవర్‌ ప్లే రెండు వికెట్ల నష్టానికి కేవలం 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత కూడా లక్నో బ్యాటర్ల కష్టాలు కొనసాగాయి. కమిన్స్‌ వేసిన పదో ఓవర్‌లో 29 పరుగులు చేసిన కెప్టెన్‌ రాహుల్‌ అవుటయ్యాడు. పది ఓవర్లు పూర్తయ్యే సరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది.

కృనాల్‌ పాండ్యా రనౌట్‌ కావడంతో లక్నో మరింత కష్టాల్లో పడింది. నికోలస్‌ పూరన్‌ కాసేపు ధాటిగా ఆడడంతో లక్నో మళ్లీ గాడిన పడినట్లు కనిపించింది. లక్నో 15 ఓవర్లు పూర్తయ్యే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌, ఆయుష్‌ బదోని లక్నోను ఆదుకున్నారు. పరుగులు రావడమే గగనమైన వేళ వీరిద్దరూ కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. పూరన్‌ 26 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌తో 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆయుష్‌ బదోని 30బంతుల్లో 9 ఫోర్లతో 55 పరుగులు చేశాడు. వీరిద్దరి పోరాటంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులకే పరిమితమైంది.ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్‌ అద్భుత స్పెల్‌తో మెరిశాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన భువీ 12 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు నేలకూల్చాడు.

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments