Homeక్రీడలుమీకు మీరే, మాకు మేమే సోషల్ మీడియాలో హార్దిక్, నటాషా

మీకు మీరే, మాకు మేమే సోషల్ మీడియాలో హార్దిక్, నటాషా


Hardik Pandya -Natasa Stankovic: భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardic Pandya),  తన భార్య నటాసా స్టాంకోవిచ్‌(Natasa Stankovic)తో విడాకుల వార్తలతో  సోషల్ మీడియా నిండిపోయింది. ఇక  T20 వరల్డ్ కప్ 2024కి ముందు  న్యూయార్క్‌కు వెళ్లిన ఇండియన్ క్రికెట్ టీంతో హార్దిక్ లేకపోవడంతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. అతను ఈ ఒత్తిడి భరించలేక  విదేశాలకు  విహారయాత్రకు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.   అయితే ఇప్పుడు తాజాగా హార్దిక్ పాండ్య మరో పోస్ట్ చేశాడు. తను మళ్ళీ కం బ్యాక్ అయ్యాడు అనే మీనింగ్ వచ్చేలా రానున్న టీ 20 వరల్డ్ కప్ టోర్నమెంట్ కు తాను సిద్ధం అని అర్థం వచ్చేలా సోషల్ మీడియా ఎక్స్ అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. 

 

మరోవైపు అటు నటాషా  పెట్టిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ కూడా వైరల్ అయ్యింది. నటాసా స్టాంకోవిక్ ఎలివేటర్‌లో మిర్రర్ సెల్ఫీని పెట్టింది దీంతోపాటు తనను ఆ  జీసస్ నడిపిస్తాడు అనే భావం వచ్చేలా ఓ  ఫోటోను పోస్ట్ చేసింది. 


అసలు హార్దిక్ పాండ్యాకు 2024 సంవత్సరం కలిసి రావడం లేదని చెప్పొచ్చు. కెప్టెన్సీ ఇస్తేనే రానని చెప్పాడేమోగానీ ముంబై ఇండియన్స్ పదవి అయితే ఇచ్చింది గానీ అటు కెప్టెన్గా కానీ, ఇటు ఆటగాడిగా గానీ ఐపీఎల్ 2024లో ఘోరంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో అతను టీ20 వరల్డ్ కప్ జట్టులో ఆడేది అనుమానమేనని వార్తలు వచ్చాయి. అయితే బిసిసిఐ ప్రకటించిన లిస్ట్ లో పాండ్య పేరు ఉండటంతో  అంతా సైలెంట్ అయిపోయింది.  అయితే  ఆ తరువాత భార్య నటాషాతో విడాకుల రూమర్స్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా  నిలిచాడు. ఇదే సమయంలో టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా జట్టు సభ్యులు న్యూయార్క్ చేరుకున్నారు. వారిలో హార్దిక్ పాండ్యా లేడు. దీంతో హార్దిక్ టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలగబోతున్నట్లు వచ్చిన వార్తలకు మరోసారు  బలం చేకూరినట్లయింది.  అయితే మళ్ళీ ఆ వార్తలకు చెక్ పెడుతూ హార్దిక్ పాండ్యా న్యూయార్క్ చేరుకున్నాడు. అక్కడ టీమిండియా  సభ్యులతో కలిసి ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నాడు.

టీం ఇండియా  ఐర్లాండ్, కెనడా,   పాకిస్థాన్,  అమెరికాతో పాటు గ్రూప్ A లో ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ లో  టీమిండియా తన  టోర్నమెంట్ జూన్ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌ తో ప్రారంభించనుంది. దానికి ముందు జూన్ 1న వార్మప్ గేమ్‌ లో భారత్ బంగ్లాదేశ్‌తో  తలపడనుంది.  

 

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments