Homeక్రీడలుమన విరాట్‌కే ఏమైంది? - కోహ్లీని 15 బంతుల్లో 4 సార్లు అవుట్‌ చేసిన బుమ్రా

మన విరాట్‌కే ఏమైంది? – కోహ్లీని 15 బంతుల్లో 4 సార్లు అవుట్‌ చేసిన బుమ్రా


Jasprit Bumrah dominates Virat Kohli in nets: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్ ఎవరు. అందులో అనుమానం ఏముంది టీమిండియా(India) పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah). మరి అత్యుత్తమ బ్యాటర్ ఎవరు. ఫామ్‌తో సంబంధం లేకుండా ఎలాంటి పిచ్‌పై అయినా చెలరేగిపోయే విరాట్ కోహ్లీ(virat  Kohli). వీళ్లిద్దరి మధ్య జరిగే సమరం ఎప్పుడైనా అభిమానులకు కావాల్సినంత మజాను ఇస్తుంది. ఇటీవల విరాట్‌ కోహ్లీ.. సరిగ్గా ఫామ్‌లో లేడు. బుమ్రా మాత్రం తన పదునైన బౌలింగ్‌తో చెలరేగిపోతూనే ఉన్నాడు. బంగ్లాదేశ్‌(ban)తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ ఈ విషయం స్పష్టమైంది. ఈ టెస్టులో బుమ్రా అయిదు వికెట్లతో చెలరేగగా… విరాట్ మాత్రం అంచనాలను అందుకోలేక పోయాడు. ఇప్పుడు నెట్స్‌లో బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు విరాట్‌ కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడడం భారత అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. విరాట్‌ ఇంతకుముందు ఎప్పుడు ఇలా ఇబ్బందులు పడ్డ దాఖలాలు కనపడడం లేదు.

 

నెట్‌ ప్రాక్టీస్‌లోనూ…

బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు.  విరాట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేశాడు. హసన్ మహమూద్  బౌలింగ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో అవుటైన విరాట్‌… రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్  బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కాన్పూర్‌లో జరిగిన రెండో టెస్టులో పుంజుకోవాలన్న తలంపుతో నెట్స్‌లో విరాట్‌ తీవ్రంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే నెట్స్‌లో  విరాట్ కోహ్లీని బుమ్రా తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. నెట్స్‌లో జస్ప్రీత్ బుమ్రాతో 15 బంతుల వ్యవధిలో విరాట్‌ను నాలుగుసార్లు ‘అవుట్’ చేశాడు. బుమ్రా వేసిన నాలుగో బంతి కోహ్లీ ప్యాడ్‌… బ్యాట్ మధ్య నుంచి దూసుకెళ్లి వికెట్లను కూల్చేసింది. మరో బంతి ప్యాడ్లకు తాకగా… బుమ్రా అప్పీల్ చేశాడు. దాంతో కోహ్లీనే నేను అవుట్ అన్నట్లు సంజ్ఞ చేశాడు. రెండు బంతుల తర్వాత, కోహ్లి తన ఆఫ్-స్టంప్ వెలుపల బంతిని వెంబడిస్తున్నప్పుడు బయట అంచుని తాకుతూ కీపర్ వైపు వెళ్లింది.  మరో బంతికి కూడా కోహ్లీ అవుటయ్యాడు. ఇలా కేవలం పదిహేను బంతుల వ్యవధిలో బుమ్రా… కోహ్లీని నాలుగు సార్లు అవుట్ చేయడం… కోహ్లీ ప్రస్తుత ఫామ్‌ను చాటుతోందని మాజీలు అంటున్నారు. 

 

 

స్పిన్నర్లను ఎదుర్కొన్న కోహ్లీ..

స్పిన్‌ త్రయం రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ల బౌలింగ్‌ను కోహ్లీ ఎదుర్కొన్నాడు. వీరి బౌలింగ్‌లోనూ కోహ్లీకి కష్టాలు తప్పలేదు. జడేజా బౌలింగ్‌లో మూడుసార్లు కోహ్లీ బంతిని మిస్సయ్యాడు. నెట్స్‌లో కోహ్లీ ఆటతీరు భారత జట్టును తీవ్రంగా ఆందోళన పరుస్తోంది. అక్షర్ పటేల్‌ బౌలింగ్‌లోనూ కోహ్లీ క్లీన్ బౌల్డ్ కావడం.. ఈ ఆందోళనను మరింత పెంచుతోంది. రేపటి నుంచే మూడు టెస్ట్ ఆరంభంకానున్న వేళ కోహ్లీ ఈ వైఫల్యాలను అధిగమిస్తాడేమో చూడాలి.

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments