Homeక్రీడలుభారీగా పెరిగిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ.. 10 బిలియన్‌ డాలర్లు దాటి

భారీగా పెరిగిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ.. 10 బిలియన్‌ డాలర్లు దాటి



<p>భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రారంభించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్&nbsp; ఓ అరుదైన హోదాను సొంతం చేసుకుంది. 10 బిలియన్&zwnj; డాలర్ల బ్రాండ్&zwnj; విలువను దాటి డెకాకార్న్&zwnj; హోదాను దక్కించుకుంది. 2008లో మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ&nbsp; , అంచనాలకు మించి సక్సెస్ అయ్యింది.&nbsp; ప్రస్తుతం ఐపీఎల్&zwnj; బ్రాండ్&zwnj; విలువ 10.7 బిలియన్&zwnj; డాలర్లు (సుమారు రూ.83,353 కోట్లు)కు చేరుకుంది.&nbsp; గతేడాది (8.4 బిలియన్&zwnj; డాలర్లు)తో పోలిస్తే ఆ విలువ 28 శాతం అధికం అయ్యింది. ఇక ఐపీఎల్&zwnj; ప్రారంభమైన&nbsp; 2008తో పోలిస్తే ఏకంగా 433 శాతం వృద్ధి ఉంది. 16 సీజన్లు ముగిసి 17వ సీజన్&zwnj;కు రంగం సిద్ధం చేసుకుంటున్న ఈ మెగా లీగ్&zwnj; బ్రాండ్&zwnj; వాల్యూను బ్రాండ్&zwnj; విలువను లెక్కగట్టే సంస్థ బ్రాండ్&zwnj; ఫినాన్స్&zwnj;రివీల్స్&zwnj; ఈ నివేదికను వెల్లడించింది. ఈ మెగా లీగ్&zwnj; బ్రాండ్&zwnj; వాల్యూ &lsquo;డెకాకార్న్&zwnj;&rsquo; స్టేటస్&zwnj;ను దాటింది. ఒక సంస్థ విలువ పది బిలియన్&zwnj; డాలర్లు దాటితే దానిని డెకాకార్న్&zwnj; అని పేర్కొంటారు. అంటే ఈ గణాంకాల ప్రకారం ప్రస్తుతం ఐపీఎల్&zwnj; బ్రాండ్&zwnj; విలువ రూ. 89,236 కోట్లు.</p>
<p>&nbsp;గతేడాది మీడియా హక్కుల కింద 6.2 బిలియన్&zwnj; డాలర్లు (రూ.48,390 కోట్లు) రావడం, రెండు ఫ్రాంఛైజీలు కొత్తగా చేరడం, కొవిడ్&zwnj; తర్వాత స్టేడియాలు పూర్తిగా నిండటం తదితర కారణాలతో బ్రాండ్&zwnj; విలువ పెరిగిందని నివేదిక పేర్కొంది. 2018, 2019లలో ఐపీఎల్&zwnj; బ్రాండ్&zwnj; విలువ వరుసగా 5.3 యూఎస్&zwnj; బిలియన్&zwnj; డాలర్లు, 5.7 యూఎస్&zwnj; బిలియన్&zwnj; డాలర్లుగా ఉండేది. అయితే కరోనా సమయంలో ఈ విలువ బాగా తగ్గిపోయింది. 2020, 2021లలో ఇది 4.4 యూఎస్&zwnj; బిలియన్&zwnj; డాలర్లు, 4.7 యూఎస్&zwnj; బిలియన్&zwnj; డాలర్లకు పడిపోయింది. అయితే ఐపీఎల్&zwnj;లోకి గుజరాత్&zwnj; జెయింట్స్&zwnj;, లక్నో సూపర్&zwnj; జెయింట్స్&zwnj; జట్ల ఎంట్రీతో పాటు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఆదాయం రెట్టింపయ్యింది.&nbsp;</p>
<p>ఇక ఫ్రాంఛైజీల విషయానికి ఐదు సార్లు ట్రోఫీ కొట్టిన&nbsp; ముంబయి ఇండియన్స్&zwnj; 87 మిలియన్&zwnj; డాలర్లు (సుమారు రూ.725 కోట్లు) ఉండగా, చెన్నై సూపర్&zwnj; కింగ్స్&zwnj; 81 మిలియన్&zwnj; డాలర్లు (రూ.675 కోట్లు)తో రెండవ స్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో కోల్&zwnj;కతా నైట్&zwnj;రైడర్స్&zwnj; 78.6 మిలియన్&zwnj; డాలర్లు (రూ.655 కోట్లు), రాయల్&zwnj; ఛాలెంజర్స్&zwnj; బెంగళూరు 69.8 మిలియన్&zwnj; డాలర్లు (రూ.581 కోట్లు)&nbsp; ఉన్నాయి. గుజరాత్&zwnj; టైటాన్స్&zwnj;, ఢిల్లీ క్యాపిటల్స్&zwnj;, రాజస్తాన్&zwnj; రాయల్స్&zwnj;, సన్&zwnj; రైజర్స్&zwnj; హైదరాబాద్&zwnj;, లక్నో సూపర్&zwnj; జెయింట్స్&zwnj;, పంజాబ్&zwnj; కింగ్స్&zwnj;లు తదుపరి స్థానాల్లో నిలిచాయి.&nbsp;&nbsp;</p>
<p>త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్&zwnj;పై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఇప్పటికే ఆటగాళ్ల రిలీజ్&zwnj;, రిటెన్షన్&zwnj; ప్రక్రియ పూర్తయింది. డిసెంబర్ 19న ఐపీఎల్&zwnj; మినీ వేలం జరగనుంది. పది ప్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు 1166 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా… వేలంలో మొత్తం 333 మంది అమ్మకానికి ఉంటారు. 77 ఖాళీలు ఉండగా…. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు 333 మంది పోటీ పడుతున్నారు.&nbsp; ఇందులో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్&zwnj; దేశాల నుంచి ఇద్దరు ఉన్నారు. &nbsp;ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎందరో యువకుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. 2008లో ప్రారంభమైన ఈ లీగ్ విజయవంతంగా.. 16 సీజన్&zwnj;లు పూర్తి చేసుకుంది. అనతి కాలంలోనే రిచ్చెస్ట్ క్రికెట్&zwnj; లీగ్&zwnj;గా నిలిచింది. ఈ లీగ్&zwnj;లో ఒక్కసారైనా ఆడితే చాలు అని అనుకునే ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు.</p>



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments