Virat Kohli shows Hurricane Beryl to Anushka Sharma: T20 ప్రపంచ కప్ 2024(T20 World Cup) విజయం తరువాత టీం ఇండియా(Team india) ఆటగాళ్ళు బార్బడోస్(Barbados)లో చిక్కుకున్నారు. అక్కడ బెరిల్(Beryl) హరికేన్ కారణంగా అపారమైన విధ్వంసం ఏర్పడింది. ప్రయాణ ఆంక్షల కారణంగా, భారత బృందం, సహాయక సిబ్బంది మరియు వారి సంబంధిత కుటుంబాలు మొత్తం హోటల్‌కే పరిమితమయ్యారు. అయితే ఈ నేపధ్యమలో సోషల్ మీడియాలో ఒక వీడియొ వైరల్ అవుతోంది ఈ వీడియోలో విరాట్ కోహ్లీ ఎవరితోనైనా వీడియో కాల్‌లో ఉన్నట్లు, అలాగే బెరిల్ హరికేన్ యొక్క విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వీడియొ కాల్ లో ఉన్నది అతని భార్య అనుష్క శర్మ అని సోషల్ మీడియాలో కోహ్లీ అభిమానులు చెబుతున్నారు. ఈ వీడియోలో, విరాట్ కోహ్లీ సముద్రానికి ఎదురుగా ఉన్న రిసార్ట్ బాల్కనీలో నిలబడి, అతను వీడియో కాల్‌లో ఉన్న వ్యక్తికి సముద్రంలో వస్తున్న శక్తివంతమైన అలలు, బలమైన గాలులను అటూ, ఇటూ తిరుగుతూ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Virat Kohli showing Hurricanes to Anushka Sharma on video call at Barbados. ❤️pic.twitter.com/PzZY3RmMMb
— Tanuj Singh (@ImTanujSingh) July 2, 2024
ప్రస్తుతానికి టీం ఇండియా భారత్ కు ప్రయాణం అయ్యింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్వయంగా ఒక ప్రత్యేక విమానాన్ని క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు, కోచ్‌లు, మీడియా సిబ్బంది కోసం ఏర్పాటు చేసింది. వీరు రేపు ఉదయానికి భారత్ కు చేరనున్నారు. ఈ నేపథ్యంలో విశ్వ విజేతలుగా నిలచిన భారత ఆటగాళ్ళకు కు ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకునే అవకాశం ఉండటంతో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఢిల్లీకి చేరుకున్న తరువాత విజేతలు ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా కలవనున్నారు. ఇప్పటికే.. భారత గెలుపు ఖాయమైన వెంటనే సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని, తరువాత ఫోన్లో భారత ఆటగాళ్లతో మాట్లాడి పేరు పేరునా అభినందించారు. ఇక రేపు ప్రత్యేకంగా ప్రధానిని నేరుగా కలవనున్నారు. తరువాత వారు ఢిల్లీ నుంచి ముంబైకు ప్రయాణమవుతారు. అక్కడ నిర్వహించబోయే పలు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అయితే భారత్ కు చేరిన తరువాత వీరు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారని ఇప్పటికే
మరిన్ని చూడండి