Homeక్రీడలుప్రధాన తేడా బుమ్రా ఒక్కడే, ఆ బౌలింగ్‌ ఓ అద్భుతం

ప్రధాన తేడా బుమ్రా ఒక్కడే, ఆ బౌలింగ్‌ ఓ అద్భుతం


Nasser Hussain About Jasprit Bumrah: టీమిండియా(Team India)లో టెస్ట్‌ మ్యాచ్‌ అంటే అందరి చూపు స్పిన్నర్లపైనే. పేసర్లు నామమాత్రంగా మారిపోతారు. కానీ అందరూ ఒకెత్తు. పేసు గుర్రం జస్ప్రిత్‌ బుమ్రా(Jasprit Bumrah) మరో ఎత్తు. వైజాగ్‌ టెస్ట్‌(Vizag)లో స్పిన్నర్లకు, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై బుమ్రా ప్రదర్శన అబ్బురపరిచింది. నిప్పులు చెరిగే బంతులతో బుమ్రా ఇంగ్లాండ్‌(England) పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా తొమ్మిది వికెట్లు తీసి ఇంగ్లండ్‌ పతనాన్ని శాశించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో బుమ్రాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వైజాగ్‌ టెస్టులో భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ప్రధాన తేడా బుమ్రానే అని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ విశ్లేషించాడు. బుమ్రా బౌలింగ్‌ అద్భుతమని… రెండు జట్ల మధ్య తేడా అతడే అని,,. తొలి ఇన్నింగ్స్‌లో గొప్పగా బౌలింగ్‌ చేశాడని నాసిర్‌ హుస్సేన్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. నిర్జీవ పిచ్‌పై బుమ్రా ఆరు వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లాండ్‌ 253 పరుగులకే పరిమితమైందని గుర్తు చేశాడు. వచ్చే మూడు టెస్టులో టీమ్‌ఇండియా మరింత ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుందని అంచనా వేశాడు. కోహ్లి, రాహుల్‌లు తిరిగి జట్టులోకి వస్తే భారత్‌ మరింత బలపడుతుందని… టీమిండియాను ఎదుర్కోవాలంటే తాము ఇంకా బాగా ఆడాలని ఇంగ్లాండ్‌కు తెలుసని నాసిర్‌ హుస్సేన్‌ అన్నాడు. 

మూడో టెస్ట్‌కు దూరమేనా..?
రాజ్‌ కోట్‌ వేదికగా జరిగే మూడో టెస్ట్‌కు బుమ్రాను దూరం పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజులుగా వరుసగా మ్యాచ్‌ లు ఆడుతున్న పేసు గుర్రం బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే టీమిండియా మేనేజ్ మెంట్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌ ఆడినా బుమ్రా ఫిట్‌నెస్‌పై ప్రభావం పడుతుందని టీమిండియా మేనేజ్‌మెంట్‌ భయపడుతుందన్న వార్తలు వస్తున్నాయి. చివరి 2 టెస్టులకు బుమ్రాను మరింత ఫిట్‌ గా ఉంచేందుకు తదుపరి టెస్టు నుంచి విశ్రాంతి కల్పించిందని తెలుస్తోంది. రెండో టెస్టులో బుమ్రా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి దాదాపు 33 ఓవర్లు బౌలింగ్ చేశాడు. జట్టులోని మిగతా బౌలర్లతో పోలిస్తే బుమ్రా వేసిన ఓవర్ల సంఖ్య పెరిగింది. స్పిన్నర్‌కు అనుకూలమైన పిచ్‌పై జట్టులోని ముగ్గురు స్పిన్నర్లు బుమ్రా కంటే తక్కువ బౌలింగ్ చేశారు. తొలి టెస్టులోనూ బుమ్రా దాదాపు 25 ఓవర్లు బౌలింగ్ చేశాడు. బుమ్రా గైర్హాజరీలో మహ్మద్ సిరాజ్ జట్టులోకి రానున్నాడు. ఈ సిరీస్ నుంచి మహ్మద్ షమీ పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది.

బుమ్రా అరుదైన ఘనత
వైజాగ్‌ టెస్టులో నిప్పులు చెరిగే బంతులతో బుమ్రా ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా తొమ్మిది వికెట్లు తీసి ఇంగ్లండ్‌ పతనాన్ని శాశించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. చేతన్‌ శర్మ తర్వాత ఇంగ్లండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత సీమర్‌గా బుమ్రా రికార్డుల్లోకెక్కాడు. 1986లో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో చేతన్ శర్మ 188 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టగా.. ఈ మ్యాచ్‌లో బుమ్రా 91 పరుగులు సమర్పించుకుని 9 వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాలు బుమ్రా కెరీర్‌లో రెండో బెస్ట్‌ కావడం గమనార్హం. బుమ్రా ఇప్పటివరకూ తొమ్మిది సార్లు ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేశాడు. బుమ్రా 33 టెస్ట్‌ల్లో 20.82 సగటున 146 వికెట్లు పడొట్టాడు.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments