SRH vs RR IPL 2024 Qualifier 2: రాజస్థాన్ రాయల్స్(RR) తో జరుగుతున్నప్లే ఆఫ్ సమరంలో హైదరాబాద్(SRH) పోరాడే స్కోర్ చేసింది. పిచ్ బౌలింగ్ కి అనుకూలిస్తున్న వేళ రొటీన్ కి భిన్నంగా, ఓపిగ్గా ఆడిన సన్‌రైజర్స్ బ్యాటర్లు పర్వాలేదనిపించే స్కోర్ చేశారు. 4 బంతుల్లో 4 సిక్స్‌లతో హెన్రిచ్ క్లాసెన్ అర్ధ శతకంతో మెరవగా రాహుల్ త్రిపాఠి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఎలాంటి భారీ భాగస్వామ్యాలు నెలకొల్పలేక పోయారు. రాజస్థాన్ జట్టు బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు, అవేశ్ ఖాన్ మూడు వికెట్లు తియ్యగా , సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు.
మెరిసిన హెన్రిచ్ క్లాసెన్
రెండవ క్వాలిఫయర్‌లో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్‌లో కోల్‌కతాతో టైటిల్ కోసం తలపడనున్న నేపధ్యంలో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. అయితే మొదటి ఓవర్‌లోనే హైదరాబాద్ కు భారీ షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్, ఫోర్ బాదిన అభిషేక్ శర్మ 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. అయితే రాహుల్ త్రిపాఠి మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతుల్లో 37 పరుగులు చేసి చాహల్‌కు క్యాచ్ ఇచ్చాడు. తరువాత మక్రమ్ కూడా వెంటనే అవుట్ అవ్వడంతో మొదటి 5 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయింది. వరుస 3 వికెట్లు బౌల్ట్ పడగొట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి సన్‌రైజర్స్ స్కోరు 68/3. 7 వ ఓవర్ నుంచో హైదరాబాద్ బ్యాటర్లు నిలకడగా ఆడారు. 10 వ ఓవర్ లో హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 34 పరుగులకే ఔటయ్యాడు. ట్రావిస్ హెడ్ ఔటైన తర్వాత హైదరాబాద్ స్కోరు మందగించింది. నితీశ్ రెడ్డి 5 పరుగులకే పెవిలియన్ చేరగా, అబ్దుల్ సమద్ డకౌటయ్యాడు. ప్రధాన ఆటగాళ్లంతా అటూ ఇటుగా ఆడి చేతులెత్తేసిన వేళ ట్రావీస్ హెడ్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన షాబాజ్ అహ్మద్ 18 రన్స్ చేశాడు. 18 వ ఓవర్ లో క్లాసెన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే చివరిలో సందీప్ శర్మ క్లాసెన్ ను అవుట్ చేసి రెండవ వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. చివరి ఓవర్ అవేశ్ ఖాన్ వేయగా చెరో 5 పరుగులతో ప్యాట్ కమిన్స్, ఉనాద్కాట్ లు 6 రన్స్ తీశారు. దాంతో, హైదరాబాద్ 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3, అవేశ్ ఖాన్ 3, సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు.
మరిన్ని చూడండి