Homeక్రీడలుపాక్‌ ఆటగాళ్లకు ఎందుకంత కడుపు మంట, అర్ష్‌దీప్‌పై ఇంజీ చవకబారు ఆరోపణలు

పాక్‌ ఆటగాళ్లకు ఎందుకంత కడుపు మంట, అర్ష్‌దీప్‌పై ఇంజీ చవకబారు ఆరోపణలు


 Shami hit back at Former Pakistan captain Inzamam: టీ 20 ప్రపంచకప్‌(T 20 World Cup)లో భారత ఆటగాళ్లు విశ్వ విజేతలుగా నిలవడం… పాక్‌(Pakistan) ఆటగాళ్ల కడుపు మంటను పెంచింది. ఓడిపోయే దశ నుంచి అద్భుతంగా పోరాడి జగజ్జేతలుగా నిలిచిన టీమిండియాపై క్రికెట్‌ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తుండగా… పాక్‌ ఆటగాళ్లు మాత్రం అర్థం పర్థం లేని ఆరోపణలతో చవకబారు విమర్శలతో తమ కడుపు మంటను చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. చోటామోట ఆటగాళ్ల దగ్గరినుంచి దిగ్గజ ఆటగాళ్లు కూడా ఇదే వైఖరి అవలంభిస్తుండడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తాజాగా పాకిస్థాన్‌ దిగ్గజ ఆటగాడు ఇంజామామ్‌ ఉల్‌ హక్‌ చేసిన వ్యాఖ్యలు… పాక్‌ ఆటగాళ్ల అక్కసును మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. మంచి బౌలర్‌ను ప్రశంసిచాల్సింది పోయి ఇదేం పద్దతి ఇంజీ అంటూ క్రికెట్‌ అభిమానులు ఓ ఆట ఆడేసుకుంటున్నారు.

 

 

ఇంజీ ఏం అన్నాడంటే

టీ20 ప్రపంచకప్ 2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌(Arshdeep Singh)పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్( Inzamam-ul-Haq) చవకబారు ఆరోపణలు చేశాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ బాల్ టాంపరింగ్ చేశాడని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియాపై  అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అర్ష్‌దీప్‌పై ఇంజీ అక్కసు వెళ్లగక్కాడు. అర్ష్‌దీప్ సింగ్ 15వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతి రివర్స్ అవుతోందని… ఇది గమనించాల్సిన విషయమని ఇంజీ అన్నాడు. కొత్త బంతితో రివర్స్ స్వింగ్ అంటే అర్థం చేసుకోవచ్చని… కూడా అన్నాడు. 12వ లేదా 13వ ఓవర్‌లో అంపైర్లు తమ కళ్ళు తెరిచి బౌలర్‌ను నిశితంగా గమనించాలని ఇంజీ సూచించాడు. ఆ సమయంలో పాకిస్తానీ బౌలర్లైతే బంతిని రివర్స్ స్వింగ్ చేయగలుగుతారని…. కానీ అర్ష్‌దీప్ 15వ ఓవర్‌లో వచ్చి బంతిని రివర్స్ చేయడం తనను ఆశ్చర్యపరిచిందని ఇంజీ అన్నాడు. అంటే అర్ష్‌దీప్‌ బౌలింగ్‌కు ముందే ఏదో జరిగిందని అర్ధమని ఇంజీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. దీనిపై షమీ తీవ్రంగా స్పందించాడు.

 

ఇచ్చిపడేసిన షమీ

 ఇంజిమామ్‌ వ్యాఖ్యలపై 2023 వన్డే ప్రపంచటాప్ వికెట్ టేకర్ మహ్మద్ షమీ  తీవ్రంగా స్పందించాడు. పాకిస్థాన్‌ ఆటగాళ్లు రివర్స్‌స్వింగ్‌ చేస్తే అది బాల్ ట్యాపంరింగ్‌ కాదని… కానీ ఇతర జట్ల బౌలర్లు చేస్తే మాత్రం అది బాల్‌ ట్యాంపరింగని షమీ అన్నాడు. పాక్ మాజీ ఆటగాళ్ల లక్ష్యం ఎప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్లేనని విమర్శించాడు. దిగ్గజ ఆటగాడైన ఇంజీమామ్‌ ఇలాంటి మాటలు మాట్లాడతారని తాను ఊహించలేదని షమీ అన్నాడు.  గతంలో షమీపై షమీపైనే విచిత్రమైన ఆరోపణలు కూడా వచ్చాయి. భారత్‌ బౌలర్లకు ఇచ్చే బంతుల్లో ఒక పరికరం అమరుస్తున్నారని… దానివల్లే షమీకి అదనపు స్వింగ్ వస్తోందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు హసన్ రజా అన్నాడు. దీనిపైనా అప్పట్లో షమీ చాలా ఘాటుగా స్పదించాడు.

Also Read: ఒలింపిక్‌ రింగుల కథేంటీ? రంగుల వెనక ఉన్న మర్మమేంటో తెలుసా!

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments