Homeక్రీడలుపంత్ అరుదైన ఘనత - ఎలైట్ క్లబ్‌లో చేరిక, ధోనీ, కిర్మాణి సరసన నిలిచిన స్టార్...

పంత్ అరుదైన ఘనత – ఎలైట్ క్లబ్‌లో చేరిక, ధోనీ, కిర్మాణి సరసన నిలిచిన స్టార్ వికెట్ కీపర్


Ind Vs Aus Test Series: భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో కొనసాగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో ఉస్మాన్ ఖవాజా క్యాచ్ తీసుకుని, టెస్టుల్లో 150 డిస్మిసల్స్ మైలురాయిని చేరుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభమైన కాసేపటికే భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్ ప్లేయబుల్ బంతితో ఖవాజకు చాలెంజీ విసరగా, కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఖవాజా పెవిలియన్‌కు చేరాడు. ఈ క్యాచ్‌తో పంత్ 135 క్యాచ్‌లు పూర్తి చేసుకోగా, అతని ఖాతాలో మరో 15 స్టంపింగ్స్ ఉన్నాయి. కెరీర్‌లో 41వ టెస్టు ఆడుతున్న పంత్.. ఓవరాల్‌గా 150వ డిస్మిసల్స్ మార్కును చేరుకున్నాడు.  ఈ మార్కు చేరుకున్న భారత ప్లేయర్లలో మాజీ కెప్టెన్ 298 డిస్మిసల్స్‌తో అందరికంటే టాప్‌లో ఉండగా, మాజీ కీపర్ సయ్యద్ కిర్మాణీ 198 డిస్మిసల్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు. 

అదరగొడుతున్న హెడ్, స్మిత్..
బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న బ్రిస్బేన్ పిచ్‌పై ఆసీస్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో పండుగా చేసుకున్నారు. వన్డే తరహాలో ఆడిన హెడ్.. కేవలం 115 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 13 ఫోర్లు ఉన్నాయి. ఇక స్మిత్ నెమ్మదిగా బ్యాటింగ్ చేసి 185 బంతుల్లో వంద పరుగులను 12 ఫోర్ల సాయంతో పూర్తి చేశాడు. ఒక దశలో 75 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో నాలుగో వికెట్‌కు వీరిద్దరూ భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 241 పరుగుల భారీ పార్ట్నర్ షిప్‌లో వీరిద్దరూ భాగస్వామ్యులు అయ్యారు. అయితే మూడో సెషన్ డ్రింక్స్ విరామం తర్వాత స్మిత్‌ను బుమ్రా ఔట్ చేశాడు. ఇక 90 ఓవర్లు ముగిసేటప్పటికీ ఆసీస్ స్కోరు 6 వికెట్లకు 348 పరుగులు చేసింది. హెడ్ 152 పరుగులు చేశాడుబుమ్రాకు ఐదు వికెట్లు దక్కాయి. 

Also Read: Virat Kohli Magic: కోహ్లీ మ్యాజిక్‌ను కాపీ కొట్టిన సిరాజ్ – అప్రమత్తమైన ఆసీస్ బ్యాటర్, మ్యాచ్‌లో సరదా సన్నివేశం 

హెడ్ క్యాచ్ డ్రాప్..
మరోవైపు భారత్‌కు పీడకలలా మారిన హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను భారత కెప్టెన్ రోహిత్ శర్మ జారవిడిచాడు. ఇన్నింగ్స్ 72వ ఓవర్లో నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో ఈ ఘటన జరిగింది. ఆ ఓవర్ మూడో బంతిని ఔట్ సైడ్ లెగ్‌లో నితీశ్ వెయ్యగా, హెడ్ దాన్ని ఆడాడు. అయితే థిక్ ఎడ్జ్ తగిలి స్లివ్ వైపు వెళ్లింది. అయితే ఫస్ట్ స్లిప్ ఉన్న రోహిత్, డైవ్ చేసినా లాభం లేకపోయింది. అతని చేతి వేళ్లను రాసుకుంటూ బంతి ముందుకు వెళ్లి పోయింది. ఇది కష్టసాధ్యమైన క్యాచే అయినప్పటికీ, ఇంటర్నేషనల్ లెవల్లో పట్టి తీరాల్సిన క్యాచేనని కామేంటేటర్ల వ్యాఖ్యానించారు. ఈ ఘటన జరిగినప్పుడు హెడ్ స్కోరు 112 పరుగులు మాత్రమే కావడం విశేషం. 

Also Read: Ind Vs Aus Test Series: రోహిత్ మిస్టేక్‌తోనే ఆసీస్‌దే పై చేయి – బ్రిస్బేన్ టెస్టుపై ఆసీస్ దిగ్గజం వ్యాఖ్యలు 

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments