Homeక్రీడలునితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - కీలక సూచనలు

నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ – కీలక సూచనలు


Boxing Day Test Updates: మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాపై అజేయ సెంచరీ చేసిన భారత యువ ఆల్ రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డికి అద్భుతమైన గౌరవం దక్కింది. నితీశ్ సెంచరీ కాగానే కామెంటేటర్ స్థానంలో ఉన్న భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్.. స్టాండింగ్ ఓవెషన్ ఇచ్చాడు. లిటిల్ మాస్టర్‌గా పేరొంది ఎన్నో ఘనతలను తన పేరున లిఖించుకున్న ఈ లెజెండరీ క్రికెటర్ నుంచి నితీశ్ ఇలాంటి ప్రశంసలు పొందడంపై భారత అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక నాలుగో టెస్టులో క్లిష్టమైన దశలో బరిలోకి దిగిన నితీశ్ అజేయ సెంచరీ (105 బ్యాటింగ్)తో జట్టును ఫాలో ఆన్ గండం నుంచి తప్పించాడు. సహచరుడు వాషింగ్టన్ సుందర్ (50) సాయంతో జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. తాజాగా నితీశ్‌పై గావస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గావస్కర స్టాండింగ్ ఓవెషన్ వీడియో వైరలైంది. అబిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

అద్భుతమైన సెంచరీల్లో ఒకటి..
భారత్ తరపున ఇప్పటివరకు నమోదైన అద్భుత సెంచరీల్లో కచ్చితంగా నితీశ్ చేసిన అజేయ సెంచరీకి స్థానం ఉంటుందని గావస్కర్ కొనియాడాడు. జట్టు ఆపదలో ఉన్నప్పుడు తన టెంపర్మెంట్ తో ఆదుకున్నాడని కితాబిచ్చాడు. మరోవైపు నితీశ్ కు కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు. ఇప్పటి నుంచి ఆటను తేలికగా తీసుకోకూడదని, తను ఇంత స్థాయికి రావడం వెనకాల తన కుటుంబం పడిన కష్టాన్ని గుర్తంచుకోవాలని వ్యాఖ్యానించాడు. ఇలాగే ఆడితే నితీశ్ కు అద్భుతమైన కెరీర్ ఉంటుందని జోస్యం చెప్పాడు. 

ఈరోజును అస్సలు మర్చిపోలేం..
మరోవైపు సెంచరీ ముగిశాక నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డితో మాజీ క్రికెటర్ ఆడం గిల్ క్రిస్ట్ సంభాషించాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. తమ కుటుంబానికి ఇదో ప్రత్యేకమైన రోజని, ఈ రోజును అస్సలు మరిచి పోలేమని పేర్కొన్నాడు. 14 ఏళ్లున్నప్పటి నుంచే నితీశ్ అద్భుతమైన క్రికట్ ఆడుతున్నాడని, ప్రత్యక్షంగా ఈ సెంచరీని చూడటం తాను వర్ణించలేక పోతున్నాని వివరించాడు. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్నప్పుడు చాలా భావోద్వేగానికి గురైనట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఈ దశలో సిరాజ్ మంచి సహాకారం అందించాడని, మొత్తానికి నితీశ్ సెంచరీ సాధించడం చాలా ఆనందంగా ఉందని వ్యాఖ్యానించాడు. మరోవైపు మూడో రోజు ఆట ముగిశాక పెవిలియన్ కు వెళుతున్న నితీశ్ కు భారత జట్టు అంతా ఎదురుగా వెళ్లి, స్టాండింగ్ ఓవెషన్ ఇచ్చింది. మరోవైపు నితీశ్, సుందర్ చలవతో మూడో టెస్టులో ఫాల్ ఆన్ గండాన్ని తప్పించుకున్న భారత్.. ప్రత్యర్థి ఆధిక్యాన్ని కూడా గణనీయంగా తగ్గించింది. ఆటముగిసేసరికి 9 వికెట్లకు 358 పరుగులు చేసిన భారత్.. ఇంకా 116 పరుగుల వెనుకంజలో ఉంది.  

Also Read: Nitish Kumar Reddy Father Tears: నితీష్ కుమార్ రెడ్డి తొలి శతకంపై తండ్రి భావోద్వేగం, రవిశాస్త్రికి సైతం కన్నీళ్లు ఆగలేదు

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments