నిజంగా యువరాజే
టీమిండియాలో ఆల్‌రౌండర్‌గా యువరాజ్ సింగ్ సాగించిన ప్రస్థానం మాములుది కాదు. క్యాన్సర్‌తో పోరాడుతూ టీమిండియాకు వన్డే ప్రపంచకప్ అందించిన యువీ… క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత కూడా జట్టులో స్థానం దక్కించుకుని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. అయితే యువరాజ్ కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించిన ఓ అరుదైన ఘనత మాత్రం ఇప్పటివరకూ మరో క్రికెటర్ ఎవరూ సాధించలేకపోయారు. యువరాజ్ తన కెరీర్‌లో టీ 20 ప్రపంచకప్…వన్డే వరల్డ్‌కప్… ఛాంపియన్స్ ట్రోఫీ… అండర్ 19 వరల్డ్ కప్.. ఐపీఎల్ ట్రోఫీలను సాధించాడు. ఇలా ప్రతిష్టాత్మకమైన అయిదు ట్రోఫీలను సాధించిన మరో భారత ఆటగాడు లేడు.
మిగిలిన ఆటగాళ్లు ఇలా…
మహేంద్ర సింగ్ ధోనీ… టీ 20 ప్రపంచకప్, వన్డే వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ టైటిల్‌ను సాధించినా అండర్ 19 వరల్డ్ కప్‌ను మాత్రం గెలవలేకపోయాడు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ టీ 20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ ట్రోఫీలు సాధించినా అండర్ 19 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ ట్రోఫీలను సాధించలేదు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీది ఒక భిన్నమైన కథ. విరాట్ కోహ్లీ ఐసీసీ నిర్వహించే పరిమిత ఓవర్ల ట్రోఫీలను అన్నింటిని గెలుచుకున్నాడు ఒక్క ఐపీఎల్ తప్ప. టీ 20 ప్రపంచకప్…వన్డే వరల్డ్‌కప్… ఛాంపియన్స్ ట్రోఫీ… అండర్ 19 వరల్డ్ కప్‌లను కింగ్ గెలుచుకు్నాడు. కానీ విరాట్ ఐపీఎల్ ట్రోఫీను మాత్రం సాధించలేకపోయాడు. అందుకే యువరాజ్‌ను అందరూ పొగిడేస్తున్నారు. టీమిండియా టీ 20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఈ విషయం మరోసారి ట్రెండ్ అవుతోంది. యువీ ఆల్‌టైం గ్రేట్ అంటూ అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.
మరిన్ని చూడండి