Homeక్రీడలుతొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?

తొలి టెస్టుపై పట్టు బిగిసింది , విజయం ఇక లాంఛనమేనా?


India vs Bangladesh 1st Test Highlights: బంగ్లాదేశ్(Bangladesh) తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్(India) పట్టు బిగించింది. బంగ్లాదేశ్ ను తక్కువ పరుగులకే కట్టడి చేసిన టీమిండియా.. రెండో రోజూ ఆట ముగిసే సమాయనికి 308 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు తొలి ఇన్నింగ్సు లో భారత్ 376 పరుగులకు ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా(Ravindra jadeja) 86 పరుగుల స్కోరు వద్దే పెవిలియన్ కు చేరగా… అశ్విన్(R Aswin) 113 పరుగులు చేశాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాను భారత బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టారు. బుమ్రా నాలుగు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. దీంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 227 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. దీంతో భారత్ ఆధిక్యం ఇప్పటికే 308కి చేరింది. క్రీజులో గిల్ 33 పరుగులతో.. పంత్ 12 పరుగులతో ఉన్నారు. వీరిద్దరూ మూడో రోజూ క్రీజులో కుదురుకుంటే బంగ్లా పనైపోయినట్లే. ప్రస్తుతం భారత్ బౌలర్ల  జోరు చూస్తుంటే బంగ్లాదేశ్ కు పరాజయం తప్పేలా లేదు.

 

తొలి ఇన్నింగ్స్ ముగిసిందిలా..

ఓవర్ నైట్ స్కోరు 349 పరుగులతో రెండో రోజూ ఆట ఆరంభించిన టీమిండియా 376 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 86 పరుగుల వద్దే రవీంద్ర జడేజా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే సెంచరీ హీరో అశ్విన్ కూడా అవుటయ్యాడు. 133 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 13 పరుగులు చేసిన అశ్విన్ ను.. తస్కిన్ అహ్మద్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే భారత ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 376 పరుగులకు పరిమితమైంది. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ అయిదు వికెట్లతో మెరిశాడు.

 

బంగ్లా తిప్పలు

భారత్ ఇన్నింగ్స్ ముగిశాక తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ ను భారత బౌలర్లు వణికించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే బుమ్రా బంగ్లాకు షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్ చివరి బంతికి షాదాన్ ఇస్లాంను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఆకాశ్ దీప్ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి బంగ్లాను కష్టాల్లోకి నెట్టాడు. దీంతో 22 పరుగులకే బంగ్లా మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా బంగ్లా పతనం కొనసాగింది. బుమ్రా ధాటికి బంగ్లా 40 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. షకీబుల్ హసన్, లిట్టన్ దాస్ కాసేపు భారత బౌలర్లను ప్రతిఘటించారు. జట్టు స్కోరును 91 పరుగులకు చేర్చారు. ఆ తర్వాత భారత బౌలర్లు పంజా విసరడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్సులో 149 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ కు 227 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.

 

మళ్లీ నిరాశపర్చిన రోహిత్

అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. రోహిత్ 5 పరుగులే చేసి వెనుదిరిగగా…యశస్వీ జైస్వాల్ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ 17 పరుగులు చేసి క్రీజులో కుదురుకునే వేళ అవుటయ్యాడు. ఇక మరో వికెట్ పడకుండా పంత్, గిల్ రెండో రోజును ముగించారు.  భారత జట్టు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.

 

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments