The journey of Gujarat Titans in IPL 2024: ఐపీఎల్(IPL)లో అత్యంత విజయవంతైమన జట్టుగా ఉన్న గుజరాత్ టైటాన్స్(GT)…ఈసారి కనీసం ప్లే ఆఫ్‌కు చేరుకోకుండానే రిక్తహస్తాలతో వెనుదిరిగింది. 2022 సీజన్‌లో తొలిసారి ఐపీఎల్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్… మొదటి సీజన్‌లోనే అదరగొట్టింది. హార్దిక్ పాండ్యా(Hardic Pandya) సారథ్యంలో తొలిసారే ఐపీఎల్ టైటిల్‌ను ఒడిసిపట్టి చరిత్ర సృష్టించింది. 2022 సీజన్ ఫైనల్స్‌లో రాజస్థాన్ రాయల్స్(RR)ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి గుజరాత్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. 2023 సీజన్‌లోనూ అద్భుత ప్రదర్శనతో గుజరాత్ ఆకట్టుకుంది. ఆ సీజన్‌లోనూ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో బరిలోకి దిగిన గుజరాత్… ఫైనల్స్‌కు చేరుకుంది. ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో పరాజయం పాలైనా అద్భుత పోరాటంతో ఆకట్టుంది. 2023 సీజన్ మొత్తం సాధికార ఆటతీరుతో గుజరాత్ ముందుకు సాగింది. హార్దిక్ పాండ్యా జట్టును గొప్పగా ముందుకు నడిపించాడు. అయితే హార్దిక్ పాండ్యా గుజరాత్‌ను వీడి ముంబై(MI) పంచన చేరడం.. మహ్మద్ షమీ గాయంతో దూరం కావడం… గిల్(Gill) తొలిసారి సారధ్య బాధ్యతలు స్వీకరిచడం సహా కొన్ని అవరోధాలతో ఈసారి కప్పు లేకుండానే గుజరాత్ వెనుదిరిగింది. ప్లే ఆఫ్‌కు అయినా చేరాలన్న గుజరాత్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.
మూడో జట్టుగా గుజరాత్
అందరికీ అభినందనలు
ఈ సీజన్‌లో తమకు మద్దతు ఇచ్చినందుకు అభిమానులకు గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. మే 16న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గుజరాత్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. హైదరాబాద్‌పై గెలిచినా గుజరాత్‌కు కేవలం 13 పాయింట్లు మాత్రమే దక్కుతాయి. ఐపీఎల్‌లో ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే కనీసం 14 పాయింట్లు అవసరం. మరోవైపు ఈ ఐపీఎల్‌లో ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా మిగిలిన రెండు స్థానాల కోసం అయిదు జట్లు పోరాడుతున్నాయి. హైదరాబాద్, చెన్నైకు ప్లే ఆఫ్ చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మిగిలిన జట్లకూ అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని చూడండి